తెలంగాణలో పీజీ మెడికల్ సీట్ల భర్తీకి ఆగస్టు 27 వరకు మొదటి విడత వెబ్‌కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఆగస్టు 25 ఒక ప్రకటనలో తెలిపింది. దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో మొదటి విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను యూనివర్సిటీ విడుదల చేసింది. యూనివర్సిటీ పరిధిలోని పీజీ మెడికల్ కళాశాలల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్లను దీనిద్వారా భర్తీ చేయనున్నారు.
అభ్యర్థులు ఆగస్టు 27న సాయంత్రం 4 గంటల వరకు మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. మెరిట్ జాబితా అదేవిధంగా సీట్ల ఖాళీల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను చూడవల్సిందిగా యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.
ALSO READ:
'గేట్-2024' దరఖాస్తు ప్రక్రియ ఆలస్యం, ప్రారంభం ఎప్పుడంటే?
దేశంలోని ఐఐటీలతోపాటు ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(GATE-2024) దరఖాస్తు ప్రక్రియ వాయిదాపడింది. ఆగస్టు 24 నుంచి ప్రారంభంకావాల్సిన దరఖాస్తు ప్రక్రియ వారంరోజులు ఆలస్యంగా మొదలుకానుంది. ఆగస్టు 30 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకానుందని ఐఐఎస్సీ బెంగళూరు వెల్లడించింది. ఈ ఏడాది కొత్తగా డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేపర్‌ను ప్రవేశపెట్టారు. పరీక్షలను 2024 ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో దేశంలోని 200 నగరాల్లో నిర్వహించనున్నారు. గేట్ స్కోర్ ఆధారంగా జాతీయస్థాయిలోని విద్యాసంస్థలే కాకుండా పలు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించి, ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఇకపై 22 భారతీయ భాషల్లో సీబీఎస్‌ఈ చదువులు - పుస్తకాల రూపకల్పన దిశగా ఎన్‌సీఈఆర్‌టీ
సీబీఎస్‌ఈ సిలబస్ పాఠశాలల్లో ఇకపై తెలుగులో కూడా బోధన మొదలుకానుంది. ప్రస్తుతం హిందీ, ఆంగ్ల భాషల్లో బోధన జరుగుతుండగా.. కొత్తగా బోధన మీడియం భాషలుగా తెలుగు సహా రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో గుర్తించిన మరో 21 భాషలను చేరుస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ భాషలను ప్రోత్సహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. నూతన విద్యా విధానం అమలు మొదలు వైద్య, న్యాయ, ఇంజినీరింగ్ కోర్సులను భారతీయ భాషల్లో బోధించేందుకు ఏర్పాట్ల వరకు దేశ విద్యారంగం కొత్తరూపు సంతరించుకుంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో కొత్త పీజీ కోర్సు అందుబాటులోకి, ఈ ఏడాది నుంచే ప్రవేశాలు
హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (JNAFAU)లో కొత్త పీజీ (మాస్టర్స్) కోర్సు అందుబాటులోకి వచ్చింది. ఎనర్జీ అండ్ సస్టైనబుల్ బిల్ట్ ఎన్విరాన్‌మెంట్ పేరుతో కొత్త మాస్టర్స్ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు యూనివర్సిటీ అధికారులు శనివారం నాడు ప్రకటించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ యూనివర్సిటీలో ఈ కోర్సును ప్రవేశపెట్టారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఈ కోర్సును ప్రవేశపెట్టిన తొలి విద్యాసంస్థ ఇదేనని వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.కవితా దర్యాణిరావు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఈ కోర్సు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. పరిశ్రమ, సబ్జెక్ట్ నిపుణుల సహకారంతో ఈ కోర్సును రూపొందించబడిందని, కోర్సులో 20 మందికి ప్రవేశాలను కల్పించనున్నట్లు తెలిపారు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..