Hyderabad: ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా విద్యార్థులను సిద్ధం చేసే దిశగా హైదరాబాద్‌లోని పల్లవి మోడల్ స్కూల్స్ కీలక అడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా  TOEFL Young Students Series (YSS) ప్రోగ్రామ్‌ను స్వీకరించిన  పాఠశాలగా పల్లవి మోడల్ స్కూల్స్ నిలిచింది. ఈ కార్యక్రమం అమలు కోసం ABP ఎడ్యుకేషన్ గ్రూప్‌నకు చెందిన హెడ్‌వర్డ్ పబ్లిషింగ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.

Continues below advertisement

TOEFL Young Students Series (YSS)  అనేది ఇంగ్లిష్ భాషా నైపుణ్యాన్ని గుర్తించే కార్యక్రమం. దీనిని అంతర్జాతీయ యూనివర్సిటీ ప్రవేశపరీక్షల కోసం TOEFL ను నిర్వహించే..   Educational Testing Service ETS దీనిని కూడా నిర్వహిస్తుంది. ఇది పూర్తిగా పాఠశాల స్థాయి విద్యార్థులకు ఉద్దేశించింది. ఇందులో విభాగాలుంటాయి. TOEFL Primary ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో చదవడం, రాయడంలో వాళ్ల స్థాయిలను అంచనా వేస్తుంది.  TOEFL Junior ప్రోగ్రామ్‌లో రీడింగ్ కాంప్రహెన్షన్స్, భాషా నైపుణ్యాలు, రాతపరీక్షలు ఉంటాయి. TOEFL ఇంగ్లీషులో అత్యుతన్నత పరీక్షల్లో ఒకటి. పాఠశాల స్థాయిలో మొదటిసారిగా పల్లవి స్కూల్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై సంతకాల కార్యక్రమానికి ETS సౌత్ ఆసియా కాంటినెంటల్ డైరెక్టర్ అజయ్ ప్రతాప్ సింగ్, హెడ్‌వర్డ్ పబ్లిషింగ్ ప్రెసిడెంట్ మహేశ్ శ్రీవాస్తవ, ఆ సంస్థ AVP – సేల్స్ అండ్ అకడమిక్ పార్ట్‌నర్‌షిప్స్ శశి గుడిబండి హాజరయ్యారు. పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ డైరెక్టర్ సుశీల్, పల్లవి మోడల్ స్కూల్ బోడుప్పల్ ప్రిన్సిపాల్ తనూజ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ABP ఎడ్యుకేషన్ CEO యశ్ మెహతా మాట్లాడుతూ.. అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇంగ్లిష్ భాషపై పట్టు ఎంతో అవసరమని అన్నారు. TOEFL YSS ప్రోగ్రామ్‌ను మొదటిసారిగా స్వీకరించిన పాఠశాలగా పల్లవి మోడల్ స్కూల్స్ నిర్ణయం తీసుకోవడం, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యను అందించాలనే ఆ సంస్థ ఆలోచనను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు.

Continues below advertisement

“ABP ఎడ్యుకేషన్‌లో ఇంగ్లిష్ భాషా ప్రావీణ్యం ప్రపంచస్థాయి అవకాశాలకు కీలకమైన మార్గమని మేము విశ్వసిస్తున్నాం. TOEFL YSS ప్రోగ్రామ్‌ను స్వీకరించిన తొలి పాఠశాలగా పల్లవి మోడల్ స్కూల్ నిలవడం దాని ప్రగతిశీల దృక్పథానికి, భవిష్యత్తుకు సిద్ధమైన విద్యను అందించాలనే నిబద్ధతకు నిదర్శనం. హెడ్‌వర్డ్ పబ్లిషింగ్ ద్వారా పల్లవి మోడల్ స్కూల్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని, యువ విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇంగ్లిష్ భాషా అభ్యాస అవకాశాలను అందించడం మాకు సంతోషంగా ఉంది. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, ప్రపంచస్థాయి అవకాశాలను అందిపుచ్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఈ భాగస్వామ్యం కీలక అడుగు” అని యశ్ మెహతా తెలిపారు.

ఈ ఒప్పందంతో పాఠశాలల్లో విద్యా బోధనలో కొత్త విధానాలను తీసుకురావాలనే పల్లవి మోడల్ స్కూల్స్ ప్రయత్నానికి మరింత బలం చేకూరనుంది. అంతర్జాతీయ స్థాయిలో ఉపయోగపడే విద్యా వనరులు, అభ్యాస పరిష్కారాలను భారతీయ పాఠశాలలకు అందించాలనే హెడ్‌వర్డ్ పబ్లిషింగ్ లక్ష్యానికి కూడా ఈ భాగస్వామ్యం తోడ్పడనుంది.

కాగా, ABP ఎడ్యుకేషన్ గ్రూప్‌లో భాగమైన హెడ్‌వర్డ్ పబ్లిషింగ్ కంపెనీ విద్యా రంగంలో పాఠ్యపుస్తకాలు, ఇంగ్లిష్ భాషా అభ్యాస వనరులు, డిజిటల్ ఎడ్యుకేషన్ సొల్యూషన్స్‌ను అందిస్తోంది. పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు వినూత్న విద్యా వనరులను అందించడంపై సంస్థ పనిచేస్తోంది.