దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలైన కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎంలలో 11వేలకు పైగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు.


దేశవ్యాప్తంగా ఉన్న 45 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 18,956 పోస్టులు మంజూరు కాగా.. వీటిలో 6,480 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.


ఐఐటీలకు 11,170 పోస్టులు మంజూరు కాగా.. ప్రస్తుతం 4,502 పోస్టులు; ఐఐఎంలలో 1566 పోస్టులు మంజూరు కాగా.. 493 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు ఆయన తన సమాధానంలో వివరించారు. ఆయా విద్యాసంస్థల్లో ఖాళీలు ఏర్పడటం, వాటిని భర్తీ చేయడం నిరంతర ప్రక్రియ అని కేంద్ర మంత్రి తెలిపారు.


కేంద్రీయ విశ్వవిద్యాలయాలు స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారం ఏర్పాటైన ఈ సంస్థల్లో నియామక ప్రక్రియ యూజీసీ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతుందని తెలిపారు. ఎప్పటికప్పుడు సమీక్షించుకొని ఉద్యోగ ఖాళీలను మిషన్ మోడ్‌లో భర్తీ చేయాలని అన్ని ఉన్నత విద్యా సంస్థలను ఆదేశించినట్టు ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు.



Also Read:


ఎంబీబీఎస్ ప్రవేశాల‌కు 13, 14 తేదీల్లో వెబ్ కౌన్సెలింగ్! వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోండి!
తెలంగాణలో మిగిలిపోయిన ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి డిసెంబరు 13, 14 తేదీల్లో  వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించ‌నున్నారు. ఈ మేరకు కాళోజీ నారాయ‌ణ‌రావు ఆరోగ్య విశ్వవిద్యాల‌యం డిసెంబరు 12న మాప్ అప్ నోటిఫికేషన్‌ను విడుద‌ల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఏంబీబీఎస్ యాజమాన్య  కోటా  సీట్లకు  ఇప్పటికే  రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తి అయింది. యాజమాన్యకోటలో  మిగిలిపోయిన ఖాళీలను ఈ మాప్ అప్ రౌండ్ ద్వారా భర్తీ చేయనున్నారు. డిసెంబరు 13న మధ్యాహ్నం 2 గంట‌ల  నుంచి  డిసెంబరు 14న మధ్యాహ్నం   2 గంట‌ల  వ‌ర‌కు వెబ్ ఆఫ్షన్లును నమోదు చేసుకోవాలి.  
వెబ్ఆప్లన్లు నమోదుకు క్లిక్ చేయండి.. 


ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 596 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు!
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 60శాతం మార్కులతో బీఈ, బీటెక్(సివిల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/టెలికమ్యూనికేషన్స్/ఆర్కిటెక్చర్) ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా డిసెంబరు 22 నుంచి జనవరి 21లోగా దరఖాస్తుచేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు, నోటిఫికేషన్ విడుదల!
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన అగ్రిపథ్ స్కీమ్‌లో భాగంగా.. ఇండియన్ నేవీలో అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 1400 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంటర్ ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిసెంబర్ 8 నుంచి 17 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రాతపరీక్ష, ఫిజికల్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...