OU Admissions: ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ ఎంఎస్సీ డిప్లొమా ప్రోగ్రామ్

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ 2023 విద్యా సంవత్సరానికి పోస్ట్ ఎంఎస్సీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Continues below advertisement

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ 2023 విద్యా సంవత్సరానికి పోస్ట్ ఎంఎస్సీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రవేశాలు పొందువారు కనీసం 60 శాతం మార్కులతో ఎంఎస్సీ (ఫిజిక్స్/ న్యూక్లియర్ ఫిజిక్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి. అక్టోబరు 9న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. నవంబరు 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రవేశ పరీక్ష ఆధారంగా కోర్సుకు అభ్యర్థులను ఎంపిచేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది.

Continues below advertisement

వివరాలు..

* పోస్ట్ ఎంఎస్సీ డిప్లొమా ఇన్‌ రేడియోలాజికల్ ఫిజిక్స్‌

కోర్సు వ్యవధి: రెండేళ్లు.

సీట్ల సంఖ్య:16.

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎంఎస్సీ (ఫిజిక్స్/ న్యూక్లియర్ ఫిజిక్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. దరఖాస్తుతోపాటు పదోతరగతి మార్కుల సర్టిఫికేట్, ఐసీఆర్ సమ్మర్ షీట్, అక్‌నాలెడ్జ్‌మెంట్ కార్డు జతచేసి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి.

దరఖాస్తు ఫీజు: రూ.1500.  'The Director, Directorate of Admissions, O.U' పేరిట హైదరాబాద్‌లో చెల్లుబాటు అయ్యేలా డిడి తీయాలి. 

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, కౌన్సెలింగ్ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు...

➥ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.10.2023. 

➥ దరఖాస్తుకు చివరితేది: 31.10.2023.

➥ రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 10.11.2023.

➥ ప్రవేశ పరీక్ష తేది: 19.11.2023.

బ్యాంకు ఖాతా వివరాలు..

బెనిఫిషియరీ పేరు: DIR ADMISSIONS OU HYD

బ్యాంకు పేరు: SBI, Osmania University Branch, Hyd

అకౌంట్ నెంబరు: 52198263105

IFSC కోడ్: SBIN0020071

బెనిఫిషియరీ చిరునామా: 
Directorate of Admissions, 
Osmania University, Hyderabad, TS.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Director
Directorate of Admissions
Osmania University, Hyderabad - 500 007
Telangana State, Phone : 040 - 27090136.

Notification

Application & ICR Summary Sheet

Website

ALSO READ:

టీఎస్ ఐసెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన టీఎస్‌ఐసెట్ కౌన్సెలింగ్‌లో మిగిలిన సీట్ల భర్తీకి 'ప్రత్యేక విడత' కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూలును ఉన్నత విద్యామండలి అక్టోబరు 11న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబ‌ర్ 15 నుంచి స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. అభ్యర్థులు అక్టోబ‌ర్ 15న ప్రాథమిక సమాచారం ఆన్‌లైన్ ఫైలింగ్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ ఉంటుంది. అక్టోబ‌ర్ 16న ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. అక్టోబ‌ర్ 16 నుంచి 17 వ‌ర‌కు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. అక్టోబ‌ర్ 17 వెబ్ ఆప్షన్లు ఫ్రీజింగ్ చేసుకోవాలి. వెబ్‌ఆప్షనలు నమోదుచేసుకున్నవారికి అక్టోబ‌ర్ 20న సీట్లను కేటాయిస్తారు.
ఐసెట్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

బీపీటీ, బీఎస్సీ పారామెడికల్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల
ఏపీలో 2023-24 విద్యాసంవత్సరానికి బీపీటీ, బీఎస్సీ పారా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి డా.వైఎస్సార్‌ హెల్త్ యూనివర్సిటీ అక్టోబరు 8న నోటిఫికేషన్ విడుదల చేసింది. బీపీటీతో పాటు వివిధ బీఎస్సీ పారామెడికల్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కాంపిటెంట్‌ అథారిటీ కోటా సీట్ల భర్తీకి అక్టోబర్‌ 8 నుంచి 19 వరకు అర్హులైన ఇంటర్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

Continues below advertisement