తెలంగాణలో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సీపీగేట్‌ పరీక్షల షెడ్యూలును ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. దీనిప్రకారం జూన్ 30 నుంచి జులై 10 వరకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజు మూడు విడతల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. కేటాయించిన సీట్ల కంటే తక్కువ దరఖాస్తులు అందినందున ఈసారి ఎంఏ అరబిక్, కన్నడ, మరాఠి, పర్షియన్, థియేటర్ ఆర్ట్స్ కోర్సులకు పరీక్షలు నిర్వహించట్లేదు.


పెరిగిన దరఖాస్తులు...
సీపీగెట్ పరీక్షకు పోటీపడే అభ్యర్థుల సంఖ్య ఈసారి స్వల్పంగా పెరిగింది. గతేడాది ఈ పరీక్షకు 67,117 దరఖాస్తులు రాగా, ఈ ఏడాది ఈ సంఖ్య 69,439కి పెరిగింది. చరిత్ర, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్, కంప్యూటర్ సైన్స్ కోర్సులకు ఈ ఏడాది అధికంగా దరఖాస్తులు రాగా కామర్స్, మరికొన్నింటికి తగ్గాయని కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. 




తెలంగాణలోని కళాశాల్లో పీజీ కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీగెట్‌) -2023’ నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి మే 1న విడుదల చేసిన సంగతి తెలిసిందే. సీపీగెట్ ఆన్‌లైన్ దరఖాస్తులను మే 12 నుంచి జూన్‌ 16 వరకు స్వీకరించారు. ఇక రూ.500 ఆలస్య రుసుముతో జూన్‌ 18 వరకు, రూ.2వేల ఆలస్య రుసుముతో జూన్‌ 20 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. జూన్‌ చివరివారంలో సీపీగెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. 


సీపీగెట్ ద్వారా ఉస్మానియా, కాక‌తీయ‌, పాల‌మూరు, మ‌హాత్మాగాంధీ, శాతవాహ‌న‌, తెలంగాణ‌, జేఎన్టీయూహెచ్, మ‌హిళా వ‌ర్సిటీల్లో ప్రవేశాలు క‌ల్పించ‌నున్నారు. ఈ యూనివర్సిటీల్లోని ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర వంటి సంప్రదాయ కోర్సుల్లో సీట్లను భర్తీచేస్తారు. మొత్తం 84 సబ్జెక్టులకు రాష్ట్రంలోని 12 జోన్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల ద్వారా రాష్ట్రంలోని యూనివర్సిటీల పరిధిలోని 320 కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆయా కళాశాలల్లో మొత్తం 50 కోర్సుల్లో 112 విభాగాలకు విద్యార్థులు ప్రవేశాలు కల్పిస్తారు. 


ప్రవేశాలు కల్పించే కోర్సులు: ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంసీజే, మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్స్, ఎంఈడీ, ఎంపీఈడీ, పీజీ డిప్లొమా కోర్సులు, ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు.


ప్రవేశం కల్పించే యూనివర్సిటీలు: ఉస్మానియా, కాక‌తీయ‌, పాల‌మూరు, మ‌హాత్మాగాంధీ, శాతవాహ‌న‌, తెలంగాణ‌, జేఎన్టీయూహెచ్, తెలంగాణ మ‌హిళా వ‌ర్సిటీలు సీపీగెట్ పరీక్ష ఆధారంగా క్యాంపస్, అనుబంధ కళాశాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాయి.


పరీక్ష విధానం: ప్రశ్నపత్రంలో 100 మార్కులకు 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అడుగుతారు. బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనిటిక్స్ అండ్ మైక్రోబయాలజీ సబ్జెక్టులకు సంబంధించిన పేపర్ పార్ట్ ఎలో కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు, పార్ట్ బిలో ఫిజిక్స్, బోటనీ, జువాలజీ, జెనిటిక్స్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీల్లోని ఆప్షనల్ సబ్జెక్టు (బీఎస్సీలో చదివిన) నుంచి 60 ప్రశ్నలు వస్తాయి. బయోటెక్నాలజీ పేపర్‌లో పార్ట్ ఎ (కెమిస్ట్రీ)లో 40 ప్రశ్నలు, పార్ట్-బి (బయోటెక్నాలజీ)లో 60 ప్రశ్నలు అడుగుతారు.


ALSO READ:


నవోదయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ - పరీక్ష విధానం, ఎంపిక, అర్హతల వివరాలు ఇలా!
జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరాకిగాను ఆరోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ ఏడాది రెండు విడతల్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 20న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ ఏడాది నవంబరు 4న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే చాలు.. ఇంటర్‌ దాకా ఉచితంగా చదువు, వసతి, భోజనం కల్పిస్తారు. బోధన కూడా అత్యున్నత ప్రమాణాల్లో ఉంటుంది. ప్రవేశ పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19న ప్రారంభంకాగా, ఆగస్టు 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.  
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఏపీలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
ఏపీలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. ఏపీ ఉన్నత విద్యామండలి జూన్ 18న ఆన్‌లైన్ అడ్మిషన్స్ మాడ్యుల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (OAMDC) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ/ఎయిడెడ్/ప్రైవేటు అన్ఎయిడెడ్/అటానమస్ డిగ్రీ కాలేజీల్లో సాధారణ డిగ్రీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బి.వొకేషనల్, బీఎఫ్‌ఏ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్ కోర్సుల్లో చేరేందుకు జూన్ 19 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. 
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..