CUET UG Result: సీయూఈటీ యూజీ - 2024 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

CUET Results: సెంట్రల్ యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ''సీయూఈటీ యూజీ - 2024' పరీక్ష ఫలితాలనను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జులై 28న విడుదల చేసింది.

Continues below advertisement

CUET UG 2024 Results Released: దేశంలోని వివిధ కాలేజీలు, యూనివర్సిటీల్లో డిగ్రీ (యూజీ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (CUET UG) ఫలితాలు జులై 28న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ, ఈమెయిల్, మొబైల్ నెంబరు వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. 

Continues below advertisement

సీయూఈటీ యూజీ 2024 ఫలితాల కోసం క్లిక్ చేయండి..

దేశంలో 379 నగరాల్లో, విదేశాల్లో 26 కేంద్రాల్లో మే 15 నుంచి జూన్‌ 29 వరకు 13 భాషల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు మొత్తం 13.48 లక్షల మంది హాజరయ్యారు. ఈ సారి హైబ్రిడ్(ఆన్‌లైన్, ఆఫ్‌లైన్(పేపర్-పెన్)) విధానంలో పరీక్షలు నిర్వహించారు. 15 సబ్జెక్టులకు ఆఫ్‌లైన్ విధానంలో, మిగిలిన సబ్జె్క్టులకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించారు. సీయూఈటీ యూజీ ప్రాథమిక కీని జులై 7న విడుదల చేసి, జులై 9 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. జులై 25న తుది ఆన్సర్ కీని ఎన్టీఏ విడుదల చేసింది. తాజాగా ఫలితాలను విడుదల చేసింది.

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ(CUET UG)-2024 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఫిబ్రవరి 27న విడుదల చేసిన సంగతి తెలిసిందే. విద్యార్థుల నుంచి ఫిబ్రవరి 27 మార్చి 26 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మార్చి 28, 29 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు.  సీయూఈటీ యూజీ స్కోరు ప్రవేశ పరీక్ష స్కోరు ఆధారంగా దేశంలోని కేంద్రీయ వర్సిటీలతోపాటు, ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలు సైతం ప్రవేశాలు కల్పిస్తాయి. వీటిలో 12 రాష్ట్ర యూనివర్సిటీలు, 11 డీమ్డ్ వర్సిటీలు, 19 ప్రైవేటు యూనివర్సిటీలతో కలిపి మొత్తం 99 యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 13 భాషల్లో సీయూఈటీ యూజీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఏదైనా ఒక లాంగ్వేజ్ పరీక్షను తప్పక రాయాల్సి ఉంటుంది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాలం, హిందీ, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ, అస్సామీ, పంజాబీ, బెంగాళీ, ఒరియా, ఇంగ్లిష్‌లలో ఏదైనా ఒక భాషను ఎంచుకోవచ్చు.

పరీక్ష విధానం.. 
యూజీ పరీక్ష మూడు సెక్షన్లుగా జరుగుతుంది. మొదటి సెక్షన్(1ఎ, 1బి) లాంగ్వేజ్‌లో, రెండో సెక్షన్ స్పెసిఫిక్ సబ్జెక్టులో, మూడో సెక్షన్ జనరల్ టెస్ట్‌లో మల్టిఫుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు 5 మార్కులు. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. మొదటి సెక్షన్‌లో 50 ప్రశ్నలకు గానూ 40 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. రెండో సెక్షన్‌లోనూ 50 ప్రశ్నలకు గానూ 40 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. మూడో సెక్షన్‌లో 60 ప్రశ్నలకు గానూ 50 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. సీయూఈటీ యూజీ 2024 ప్రవేశ పరీక్షలో సాధించిన స్కోరు ఆధారంగా ప్రముఖ కేంద్రియ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలతో పాటు ప్రైవేటు కళాశాలల్లో, డీమ్డ్‌ యూనివర్సిటీల్లోనూ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందడానికి ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మార్కులు ఉపయోగపడతాయి.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement