UGC NET: యూజీసీ నెట్ జూన్ - 2024 దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు, ఎప్పటివరకంటే?
UGC NET: యూజీసీ నెట్ జూన్ - 2024 దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు, ఎప్పటివరకంటే?
Omprakash Updated at:
15 May 2024 11:31 PM (IST)
దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ (జూన్)-2024 దరఖాస్తు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మే 19 వరకు పొడిగించింది.
UGC NET June 2024 Application: దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ (జూన్)-2024 దరఖాస్తు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మరోసారి పొడిగించింది. దరఖాస్తు ప్రక్రియ మే 20న ప్రారంభంకాగా.. మే 15తో దరఖాస్తు గడువు ముగియాల్సి ఉంది. అయితే దరఖాస్తు గడువును మే 19 వరకు పొడిగిస్తూ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా పరీక్ష ఫీజు చెల్లించడానికి మే 20న రాత్రి 11.59 గంటల వరకు అవకాశం కల్పించింది. ఇక దరఖాస్తుల సవరణకు మే 21 - మే 23 (రాత్రి 11.59 గంటల వరకు) వరకు అవకాశం కల్పించింది. దరఖాస్తుకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే ఫోన్ నెంబరు: 011 - 40759000 /011 - 69227700 లేదా ఈమెయిల్: ugcnet@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు.
కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజుగా జనరల్-రూ.1150; ఈడబ్ల్యూఎస్/ఓబీసీ(నాన్-క్రిమిలేయర్)-రూ.600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్స్-రూ.325 చెల్లించాలి.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 16న యూజీసీ నెట్-2024 పరీక్షలను ఆన్లైన్ విధానంలో, రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించనున్నారు. మొదటి షిఫ్టులో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, రెండో షిఫ్టులో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.
* యూజీసీ నెట్ - జూన్ 2024 వివరాలు..
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా నాలుగేళ్ల డిగ్రీ లేదా ఎనిమిది సెమిస్టర్ల డిగ్రీ ప్రోగ్రామ్లో 75 శాతం మార్కులు లేదా సమానమైన గ్రేడ్లను సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ (నాన్ క్రిమీ లేయర్), దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, ఇతర వర్గాలకు చెందిన వారికి 5శాతం మార్కులు/గ్రేడ్లలో సడలింపు ఉంటుంది.
వయోపరిమితి:01.06.2024 నాటికి జేఆర్ఎఫ్ పోస్టులకు 30 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎలాంటి వయోపరిమితి లేదు.
➥ ఆన్లైన్ (సీబీటీ) విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 2 పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లకు కలిపి మూడు గంటల సమయం ఉంటుంది.
➥ పేపర్-1కు గంట, పేపర్-2 కు రెండు గంటల సమయం ఉంటుంది. పేపర్-1 లో 100 మార్కులకుగాను 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. రీజనింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైవర్జెంట్ థింకింగ్, జనరల్ అవేర్నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
➥ పేపర్-2లో 200 మార్కులకుగాను 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. అభ్యర్థుల ఆప్షనల్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.
తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, సికింద్రాబాద్, హయత్నగర్, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్.