NEET UG 2024 Re-revised Score Card and  Revised Final Answer Keys: నీట్ యూజీ(రివైజ్డ్) ఫలితాలను, ఫైనల్ ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జులై 26న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలతోపాటు, తుది ఆన్సర్ కీని కూడా అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు, ఈమెయిల్ వివరాలు లేదా ఫోన్ నెంబరు, సెక్యూరిటీ పిన్ వివరాలు నమోదుచేసి స్కోరుకార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే నీట్ యూజీ ఫైనల్ ఆన్సర్ కీని వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. దేశవ్యాప్తంగా మే 5న నీట్ యూజీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే.. నీట్ ఫలితాల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో.. గ్రేస్ మార్కులు కలిపిన 1563 మంది విద్యార్థులకు జూన్ 23న మళ్లీ పరీక్ష నిర్వహించారు. రివైజ్డ్ ఫలితాల ప్రకారం.. కేవలం 17 మంది అభ్యర్థులకు మాత్రమే 1వ ర్యాంకు వచ్చింది. నీట్-యూజీ పరీక్షను మొత్తం 24,06,079 మంది అభ్యర్థులు రాశారు. వీరిలో 10,29,154 మంది పురుషులు, 13,76,831 మంది మహిళలు, 18 మంది థర్డ్ జెండర్ అభ్యర్థులు ఉన్నారు.


నీట్ యూజీ రివైజ్డ్ ఫలితాలు ఇలా చూసుకోండి..
➨ నీట్ యూజీ 2024 రివైజ్డ్ ఫలితాల కోసం విద్యార్థులు మొదట ఎన్టీఏ అధికారిక‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి - exams.nta.ac.in/NEET 
➨ అక్కడ హోంపేజీలో కనిపించే 'Click Here for Re-Revised Score Card(26 July 2024)' లింక్ మీద క్లిక్ చేయాలి.
➨ విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు, ఈమెయిల్ వివరాలు లేదా ఫోన్ నెంబరు, సెక్యూరిటీ పిన్ వివరాలు నమోదుచేసి SUBMIT బటన్ మీద క్లిక్ చేయాలి.
➨విద్యార్థుల స్కోరు కార్డులు కంప్యూటర్ స్క్రీన్ మీద దర్శమిస్తాయి.
➨ స్కోరుకార్డులు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకొని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.


నీట్ యూజీ రీ-రివైజ్డ్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..


నీట్ యూజీ 2024 రివైజ్డ్ ఫైనల్ ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..


నీట్‌ యూజీ-2024 పరీక్షలో అడిగిన ఒక వివాదాస్పద ఫిజిక్స్‌ ప్రశ్నకు కచ్చితమైన సమాధానాన్ని మాత్రమే అంగీకరించాలని, ఇతర సమాధానాలకు మార్కులు రావని సుప్రీంకోర్టు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా ఎన్టీఏ సవరించిన ఫలితాలను విడుదల చేసింది. దీని ఫలితంగా మెరిట్ జాబితాలో పలు మార్పులు జరిగాయి. జులై 23న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ యూజీ -2024 స‌వరించిన తుది ఫలితాలను రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో.. తాజాగా రివైజ్డ్ స్కోరుకార్డులను ఎన్టీఏ విడుదల చేసింది.


నీట్‌ యూజీ-2024 పరీక్షలో అడిగిన ఒక వివాదాస్పద ఫిజిక్స్‌ ప్రశ్నకు సరైన సమాధానంపై ఢిల్లీ ఐఐటీ నిపుణుల కమిటీ జులై 23న సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. ఆ ప్రశ్నకు సరైన సమాధానం ఒక్కటేనని స్పష్టం చేసింది. సంబంధిత ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్లలో నాలుగోది మాత్రమే సరైన సమాధానం అని ముగ్గురు నిపుణులతో కూడిన కమిటీ తేల్చిందని ధర్మాసనం తెలిపింది. ‘స్టేట్‌మెంట్‌ 1 కరెక్ట్‌.. స్టేట్‌మెంట్‌ 2 కరెక్ట్‌ కాదు’ అని ఆ నాలుగో ఆప్షన్‌ చెబుతున్నదని పేర్కొంది. ఎన్టీఏ కూడా 4వ ఆప్షన్‌నే సరైన సమాధానంగా ఆన్సర్‌ కీలో సవరించాలని తెలిపింది. ప్రశ్న నంబర్‌ 29కు నాలుగో ఆప్షన్‌ మాత్రమే సరైన సమాధానమని తేల్చింది. ఈ నేపథ్యంలోనే సవరించిన ఫలితాల్లో నాలుగు లక్షల మంది 5 మార్కులను కోల్పోవాల్సి వచ్చింది.