NIT Warangal PhD Admissions 2023: వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డిసెంబర్-2023 సెషన్‌కు సంబంధించి పీహెచ్‌డీ (PhD) ఫుల్‌టైమ్/పార్ట్‌టైమ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఇంజినీరింగ్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్, కెమికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్) విభాగాలతోపాటు బయోటెక్నాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పించనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు గేట్/ క్యాట్/ యూజీసీ/ సీఎస్‌ఐఆర్/ఇన్‌స్పైర్/నెట్ స్కోరు సాధించి ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.800 చెల్లిస్తే సరిపోతుంది. అభ్యర్థుల నుంచి డిసెంబరు 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. సరైన అర్హతలున్నవారు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాలి. దరఖాస్తు చేసుకున్నవారి నుంచి రాత పరీక్ష/ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను డిసెంబరు 8న ప్రకటించనున్నారు. ఎంపికైనవారికి డిసెంబరు 18 నుంచి 20 వరకు రాత పరీక్ష/ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. తదనంతరం డిసెంబరు 26న తుది ఎంపిక ఫలితాలు వెల్లడిస్తారు.
* పీహెచ్‌డీ ప్రవేశాలు - డిసెంబర్ 2023 సెషన్
విభాగాలు..
➛ సివిల్ ఇంజినీరింగ్
➛ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్
➛ మెకానికల్ ఇంజినీరింగ్
➛ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్
➛ మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్
➛ కెమికల్ ఇంజినీరింగ్
➛ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్
➛ బయోటెక్నాలజీ
➛ మ్యాథ్స్
➛ ఫిజిక్స్
➛ కెమిస్ట్రీ
➛ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్
➛ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు గేట్/క్యాట్/యూజీసీ/ సీఎస్‌ఐఆర్/ఇన్‌స్పైర్/నెట్ స్కోరు సాధించి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.1600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.800 చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరితేది: 04.12.2023.
➥ రాత పరీక్ష/ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 08.12.2023.
➥ రాత పరీక్ష/ ఇంటర్వ్యూ: 18 - 20.12.2023 వరకు.
➥ ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా వెల్లడి: 26.12.2023.
ALSO READ:
ఓయూ ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ 'లేటరల్ ఎంట్రీ' ప్రవేశాలు..
డిప్లొమా అర్హత ఉండి, ఉద్యోగాలు చేస్తూ.. ఇంజినీరింగ్ చదవాలనుకునే వారికోసం 'బీటెక్ వర్కింగ్ ప్రొఫెషనల్స్' పేరుతో బీటెక్ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు తెలంగాణలోని 12 ఇంజినీరింగ్ కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇటీవలే అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఉస్మానియా సహా పలు కాలేజీల్లో వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ప్రవేశాలు కల్పించేందుకు (ఏఐసీటీఈ)అనుమతిని మంజూరు చేసింది. ఈ విద్యాసంవత్సరంలో వర్కింగ్ ప్రొఫెషనల్స్ ప్రవేశాలు పొందేందుకు నవంబరు 30 వరకు అవకాశం ఇచ్చింది. సంబంధిత విభాగంలో ఓసీ అభ్యర్థులైతే 45 శాతం మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. ఇతరులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
ప్రవేశానికి సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..