తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ 2023-2025 విద్యా సంవత్సరానికి ఎంబీఏ ప్రోగ్రాంలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ క్యాట్-2022 స్కోరు కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిభ్రవరి 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 


వివరాలు..


* ఎంబీఏ ప్రోగ్రాం


అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ క్యాట్-2022 స్కోరు కలిగి ఉండాలి.


దరఖాస్తు రుసుము: రూ.1550. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1050.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.


ఎంపిక ప్రక్రియ: క్యాట్ 2022 స్కోరు, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ, అకడమిక్ స్కోరు, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.


ముఖ్యమైన తేదీలు..


ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ: 28.02.2023 సాయంత్రం 4 గంటల వరకు.


దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 28.02.2023 సాయంత్రం 6 గంటల వరకు.




Notification 


Website 


Also Read:


బీటెక్ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌, ఎంటెక్‌ లేకుండానే 'పీహెచ్‌డీ'లోకి!
 పీజీ లేకున్నా పీహెచ్‌డీ‌ల్లో ప్రవేశాలకు ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో.. బీటెక్‌ విద్యార్థులు కూడా రిసెర్చ్‌ వైపు వెళ్లేలా జేఎన్టీయూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బీటెక్‌ నుంచే పీహెచ్‌డీలోకి ప్రవేశాలు పొందేలా అవకాశం కల్పించింది. అదికూడా ఆనర్స్‌ బీటెక్‌ డిగ్రీ పూర్తిచేసిన వారికి మాత్రమే ఈ అవకాశం కల్పించాలని వర్సిటీ నిర్ణయించింది. గతంలో బీటెక్‌ విద్యార్థులు పీహెచ్‌డీ చేయాలంటే.. ఎంటెక్‌ తప్పనిసరి. ఇప్పుడు వర్సిటీ నిర్ణయంతో అనేక మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ వెసులుబాటు కల్పించి, పీహెచ్‌డీ ప్రవేశాలు చేపట్టాలని నిర్ణయించింది. విద్యార్థులు 160 క్రెడిట్స్‌తో బీటెక్‌, మరో 18 క్రెడిట్స్‌ను పూర్తిచేస్తే ఆనర్స్‌ డిగ్రీని జారీ చేస్తారు. ఈ ఆనర్స్‌ డిగ్రీ పొందిన వారు ఎంటెక్‌, ఎంఫిల్‌ వంటి వాటితో సంబంధం లేకుండానే నేరుగా పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పిస్తారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


జేఈఈ మెయిన్స్‌ సెషన్‌-2 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్స్‌ సెషన్‌-2 పరీక్షలకు దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 15న ప్రారంభమైంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 7న ప్రారంభం కావాల్సిన దరఖాస్తు ప్రక్రియ.. వారం రోజుల ఆలస్యంగా ఫిబ్రవరి 15 నుంచి దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కొత్త అభ్యర్దులతోపాటు మొదటి సెషన్‌ రాసిన అభ్యర్ధుులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశాలకు 'జెట్' - నోటిఫికేషన్ వెల్లడి, వివరాలు ఇలా!
పుణెలోని ఫిల్మ్ & టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌టీఐఐ), కోల్‌కతాలోని సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ సంయుక్తంగా- జాయింట్ఎంట్రన్స్ టెస్ట్(జెట్) 2022-2023 నోటిఫికేషన్ విడుదల చేశాయి. దీనిద్వారా అర్హులైన అభ్యర్థులు ఫిల్మ్, టెలివిజన్  విభాగాల్లో పీజీ డిప్లొమా, యూజీ సర్టిఫికెట్, పీజీ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ప్రవేశ పరీక్షను ఎ,బి,సి గ్రూప్‌ల వారీగా నిర్వహిస్తారు. అభ్యర్థులు ఒక్కో గ్రూప్  నుంచి ఒక కోర్సు చొప్పున గరిష్ఠంగా మూడు కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..