NEET UG 2026 Result: నీట్ రీ-ఎగ్జామ్ 2026 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది వైద్య విద్యార్థులకు కొంత ఊరట లభించింది. నీట్ రీ-ఎగ్జామ్ 2026 ఫలితాలను జూలై 20వ తేదీలోగా విడుదల చేయనున్నట్లు జాతీయ పరీక్షల ఏజెన్సీ (ఎన్‌టీఏ) సూచించింది. ఏజెన్సీ ఇంకా నిర్దిష్ట తేదీని ప్రకటించనప్పటికీ, ఫలితాల తయారీ పనులు వేగంగా జరుగుతున్నాయని, వీలైనంత త్వరగా వాటిని విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. కొత్త ఎంబీబీఎస్ విద్యా సంవత్సరం షెడ్యూల్ ప్రకారమే ప్రారంభమవుతుందని కూడా స్పష్టం చేశారు. 

Continues below advertisement

గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ ఏడాది నీట్ యూజీ పరీక్ష వాస్తవానికి మే 3వ తేదీన జరగాల్సి ఉండగా, పేపర్ లీక్ ఆరోపణల కారణంగా రద్దు అయ్యింది. ఆ తర్వాత ఈ పరీక్షను జూన్ 21వ తేదీకి తిరిగి షెడ్యూల్ చేశారు. ఇప్పుడు అభ్యర్థులందరూ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వేగంగా జవాబు పత్రాల మూల్యాంకనం 

NTA అధికారుల ప్రకారం, ఫలితాలను సకాలంలో విడుదల చేయడానికి యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సంస్థ జవాబు పత్రాలను తనిఖీ చేయడమే కాకుండా, తాత్కాలిక జవాబు కీలకు విద్యార్థులు సమర్పించిన దాదాపు 10,000 అభ్యంతరాలను కూడా ఒక్కొక్కటిగా సమీక్షిస్తోంది.

Continues below advertisement

ప్రతి అభ్యంతరంతోపాటు సమర్పించిన పత్రాలు, సాక్ష్యాలతో పోలుస్తున్నారు. అవి సరైనవని తేలితే, జవాబును సవరించి, ఆ తర్వాతే తుది జవాబు కీని విడుదల చేయడం జరుగుతుంది. దీని ఆధారంగానే ఫలితాలు నిర్ణయిస్తారు. 

ఫలితాలు వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ .

ఫలితాలు విడుదలైన వెంటనే MBBS, BDS, ఇతర వైద్య కోర్సులలో ప్రవేశానికి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆల్ ఇండియా కోటా (AIQ) కౌన్సెలింగ్‌ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) నిర్వహిస్తుంది, కాగా స్టేట్ కోటా కౌన్సెలింగ్‌ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయి.

కౌన్సెలింగ్ సమయంలో, అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని, తమకు నచ్చిన వైద్య కళాశాల,  కోర్సును ఎంచుకోవాలి. అభ్యర్థి నీట్ ర్యాంక్, కేటగిరీ, రిజర్వేషన్ నియమాలు, అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఆ తర్వాత విద్యార్థులు నిర్దేశించిన సమయంలోగా తమ తమ కళాశాలలకు హాజరు కావాలి.

ఫలితాన్ని ఎలా చెక్‌ చేస్తారు?

ఫలితాలు విడుదలైన తర్వాత, అభ్యర్థులు అధికారిక నీట్ వెబ్‌సైట్ నుంచి తమ స్కోర్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోగలరు. ఈ స్కోర్‌కార్డులతోపాటు వారి ఆల్ ఇండియా ర్యాంక్, కటాఫ్, కౌన్సిలింగ్‌కు సంబంధించిన సమాచారం కూడా ఉంటుంది.