నీట్‌ యూజీ (NEET UG) కౌన్సెలింగ్‌ ప్రక్రియ వచ్చే వారం ప్రారంభంకానుంది. కౌన్సెలింగ్‌ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్‌ను మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (MCC) సెప్టెంబరు 25న నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. వెంటనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఆరంభం కానుంది. మేరకు ఎంసీసీ వర్గాలు వెల్లడించాయి. దేశంలోని మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీకి సంబంధించి నీట్‌ యూజీ ప్రవేశ పరీక్షను జూలై 17న నిర్వహించింది.


 Also Read:  ఐసెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్యతేదీలివే!

నీట్ యూజీ 2022 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) సెప్టెంబరు 7న విడుదల చేసిన సంగతి తెలిసిందే. నీట్ పరీక్షకు మొత్తం 18,72,343 మంది రిజిష్టర్ చేసుకోగా.. 17,64,571 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 9,93,069 లక్షల మంది అర్హత సాధించారు. నీట్ పరీక్షలో అర్హత సాధించినవారిలో 4,29,160 మంది మహిళలు; 5,63,902 మంది పురుషులు, ఏడుగురు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. అంటే 56.27 శాతం ఉత్తీర్ణులయ్యారు. 



ఫలితాల కోసం కింది లింక్స్ క్లిక్ చేయండి..



Final Answer Keys of NEET (UG) – 2022
 
నీట్ యూజీ 2022 ఫలితాల పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి...



ఈ ఏడాది జులై 17న దేశవ్యాప్తంగా దాదాపు 3,570 పరీక్షా కేంద్రాల్లో NEET UG - 2022  పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసారి నీట్ పరీక్షకు 18.72 లక్షల మంది అభ్యర్థులు రిజిష్టర్ చేసుకోగా.. 17.78 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. రికార్డు స్థాయిలో 95 శాతం హాజరు నమోదైంది. ఆగస్టు 31న ప్రొవిజనల్‌ ఆన్సర్‌ కీ, ఓఎంఆర్‌ షీట్లు స్కాన్‌ చేసిన చిత్రాలు వెబ్‌సైటులో అప్‌లోడ్‌ చేశారు. అభ్యర్థుల నుంచి ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ తర్వాత NEET UG - 2022 ఫలితాలను సెప్టెంబరు 7న విడుదల చేశారు.


 


Also Read:

అంబేడ్కర్ వర్సిటీ ప్రవేశాల దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును అధికారులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబరు 30 వరకు ప్రవేశాల దరఖాస్తుకు అవకాశం కల్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. 
కోర్సుల వివరాలు, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..


 


Also Read:

జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే?
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి ఎంటెక్, ఎంబీఏ పార్ట్‌టైమ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 17 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబరు 15 నుంచి 17 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
కోర్సులు, ముఖ్యమైన తేదీల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..