NEET UG Counselling 2026 schedule | మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) నీట్ యూజీ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ తాజాగా విడుదల చేసింది. ఎంసీసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, మొదటి రౌండ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ఆగస్టు 5 న ప్రారంభమవుతాయి, కాగా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 12తో ముగస్తుందని నిర్ణయించారు. ఈ కౌన్సెలింగ్ 15 శాతం ఆల్ ఇండియా కోటా, ఎంసీసీ పరిధిలోకి వచ్చే ఇతర సీట్లలో ఎంబీబీఎస్, బీడీఎస్ (BDS), బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్నారు. నీట్ యూజీ అభ్యర్థులు ఆగస్టు 5 నుండి ఎంసీసీ అధికారిక కౌన్సెలింగ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుందని ఎంసీసీ స్పష్టం చేసింది.

Continues below advertisement

నీట్ యుజి కౌన్సెలింగ్ షెడ్యూల్ 

రౌండ్-1:

Continues below advertisement

రిజిస్ట్రేషన్ ప్రారంభం: 5 ఆగస్టు 2026

రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 12 ఆగస్టు 2026

సీట్ అలాట్‌మెంట్ ఫలితం: 17 ఆగస్టు 2026

రౌండ్-2:

రిజిస్ట్రేషన్ ప్రారంభం: 25 ఆగస్టు 2026

రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 29 ఆగస్టు 2026 (మధ్యాహ్నం 03:00 గంటల వరకు)

సీట్ అలాట్‌మెంట్ ఫలితం: 02 సెప్టెంబర్ 2026

రౌండ్-3:

రిజిస్ట్రేషన్ ప్రారంభం: 11 సెప్టెంబర్ 2026

రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 15 సెప్టెంబర్ 2026 (మధ్యాహ్నం 03:00 గంటల వరకు)

సీట్ అలాట్‌మెంట్ ఫలితం: 18 సెప్టెంబర్ 2026

ఆన్‌లైన్ స్ట్రే వేకెన్సీ రౌండ్:

రిజిస్ట్రేషన్ ప్రారంభం: 28 సెప్టెంబర్ 2026

రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 30 సెప్టెంబర్ 2026 (మధ్యాహ్నం 03:00 గంటల వరకు)

సీట్ అలాట్‌మెంట్ ఫలితం: ఇంకా నిర్ణయించలేదు

Also Read: Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్

కౌన్సెలింగ్‌కు ఎవరెవరు హాజరుకావచ్చు నీట్ యుజి 2026 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ఎంబీబీఎస్, బీడీఎస్ లేదా బీఎస్సీ నర్సింగ్‌ (Bsc Nursing)లో ప్రవేశానికి నిర్ణీత అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. సంబంధిత కోర్సు కోసం నిర్ణయించిన క్వాలిఫైయింగ్ పర్సంటైల్, ఇతర ఎంట్రన్స్ నిబంధనలు పాటించడంతో పాటు నిర్ణీత సమయంలోగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి అని ఎంసీసీ పేర్కొంది. రాష్ట్ర కోటా సీట్లలో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు సంబంధిత రాష్ట్ర కౌన్సెలింగ్ అథారిటీ పోర్టల్‌లో విడిగా దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులకు ఎంసీసీ స్పష్టం చేసింది.

ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం-  అభ్యర్థులు ముందుగా ఎంసీసీ అధికారిక వెబ్‌సైట్ mcc.nic.inhttps://mcc.nic.in/ కి వెళ్లాలి.-  ఆ తర్వాత నీట్ యుజి కౌన్సెలింగ్ 2026 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.-   మీ NEET UG దరఖాస్తు వివరాలతో లాగిన్ అయి, కౌన్సెలింగ్ ఫీజు చెల్లించాలి.-  ఆ తర్వాత వ్యక్తిగత, విద్యార్హత వివరాలను నమోదు చేయాలి.-  అనంతరం డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి, మీ ప్రాధాన్యత క్రమంలో కాలేజీలు, కోర్సులను ఎంచుకోవాలి.- అన్ని ఆప్షన్లను జాగ్రత్తగా నింపిన తర్వాత, చివరి తేదీకి ముందే వాటిని లాక్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

కౌన్సెలింగ్ కోసం ఏ ఏ డాక్యుమెంట్లు అవసరం?అభ్యర్థులు కౌన్సెలింగ్, అడ్మిషన్ ప్రక్రియ సమయంలో నీట్ యూజీ 2026 స్కోర్ కార్డ్, అడ్మిట్ కార్డ్, 10వ తరగతి మార్క్‌షీట్, 12వ తరగతి మార్క్‌షీట్, పాస్ సర్టిఫికేట్స్, చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, రిజర్వేషన్ సర్టిఫికేట్, పిడబ్ల్యూబిడి సర్టిఫికేట్, స్థానికత సర్టిఫికేట్, ఎంసీసీ లేదా సంబంధిత సంస్థ కోరిన ఇతర డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలి. కాలేజీలో చేరే సమయంలో అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లను సమర్పించడం తప్పనిసరి.

సీట్ అలాట్‌మెంట్‌కు ముందు ఏం జరుగుతుంది?రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, అభ్యర్థులకు కాలేజీలు, కోర్సుల ఆప్షన్లను నమోదు చేయడానికి (చాయిస్ ఫిల్లింగ్), వాటిని లాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆప్షన్ల ఆర్డర్ ద్వారా సీట్ల కేటాయింపు చేస్తారు. కనుక వాటిని ఆలోచించి నింపాలి. చాయిస్ ఫిల్లింగ్ పూర్తయ్యాక, ఎంసీసీ అభ్యర్థుల నీట్ ర్యాంక్, కేటగిరీ, రిజర్వేషన్ నిబంధనలు, సీట్ల లభ్యత, నమోదు చేసిన ఆప్షన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ప్రక్రియను పూర్తవుతుంది.