న్యూఢిల్లీ: నీట్ యూజీ (NEET UG 2026) పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా మెడికల్ కాలేజీలలో వైద్య విద్యార్థులకు ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సైతం ప్రారంభమైంది. అభ్యర్థులు NTA అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఎగ్జామ్ రాయడానికి అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. NEET UG పరీక్ష దేశంలోనే అతిపెద్ద మెడికల్ ఎంట్రన్స్ టెస్టుగా భావిస్తారు. ఈ ఎగ్జామ్ ఉత్తీర్ణత, ర్యాంకు ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో MBBS, బీడీఎస్ (BDS), BAMS, బీహెచ్ఎంఎస్ (BHMS), BSMSతో సహా అనేక కోర్సులలో ప్రవేశం లభిస్తుంది.

Continues below advertisement

NEET UG 2026కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు

NTA విడుదల చేసిన నోటిఫికేషన్‌లో నీట్ యూజీ 2026 (NEET UG 2026)కి సంబంధించిన అన్ని ముఖ్యమైన తేదీలకు సంబంధించిన సమాచారం ఇచ్చింది. అభ్యర్థులు సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. నీట్ యూజీ అప్లికేషన్ ప్రారంభమయ్యే నేడు (ఫిబ్రవరి 8) ప్రారంభం కాగా,  దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 8, 2026 అని వెల్లడించింది. ఎగ్జామ్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ మార్చి 8. అప్లికేషన్‌లో ఏవైనా తప్పులు ఉండే ఎడిట్ చేసేందుకు విండో మార్చి 10 నుండి మార్చి 12 వరకు ఓపెన్ ఉంటుంది. NEET UG 2026 ఎగ్జామ్ డేట్ మే 3, 2026 అని నోటిఫికేషన్లో ఎన్టీఏ స్పష్టం చేసింది. 

Continues below advertisement

NEET UG 2026 అప్లికేషన్ ఫీజు ఎంత చెల్లించాలి?

NEET UG పరీక్షకు హాజరు కావడానికి వివిధ కేటగిరీల అభ్యర్థులకు వేర్వేరు అప్లికేషన్ ఫీజులు నిర్ణయించారు. ఇందులో జనరల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ. 1700 చెల్లించాలి. OBC- NCL (నాన్ క్రిమి లేయర్) / EWS అభ్యర్థులకు రూ. 1600 ఫీజు కాగా, SC / ST / దివ్యాంగులు / థర్డ్ జెండర్‌లకు రూ. 1000, విదేశాల నుండి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ. 9500 చెల్లించాలి. అప్లికేషన్ ఫీజును  ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు

NEET UG 2026 కోసం దరఖాస్తుదారు చేసుకోవాలంటే 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్‌లో వారు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులు తప్పనిసరిగా చదివి ఉండాలి. అభ్యర్థుల కనీస వయస్సు 17 సంవత్సరాలు ఉండాలి. ఏజ్ లిమిట్, ఇతర నిబంధనలు NTA మార్గదర్శకాల ప్రకారం వర్తిస్తాయి. అభ్యర్థులు సమర్పించిన వివరాలు, డాక్యుమెంట్స్ తప్పు అని తేలితే సీటు రద్దు చేస్తారు. కొన్ని సందర్భాలలో చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారు.

NEET UG 2026కి ఆన్‌లైన్‌లో ఇలా దరఖాస్తు చేసుకోండి

1. మొదట ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in ను సందర్శించాలి.

2. NEET UG 2026 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి

3. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక.. అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.

4. లాగిన్ చేసిన తరువాత అప్లికేషన్ ఫారమ్ ఫిల్ చేయాలి. 

5. మీ ఫొటో, సిగ్నేచర్, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి

6. నీట్ యూజీ 2026 అప్లికేషన్ ఫీజు చెల్లించండి.

7. అప్లికేషన్ ఫారమ్‌ను సబ్మిట్ చేసి, దానిని ప్రింట్ అవుట్‌ తీసి పెట్టుకోవడం బెటర్. 

Also Read: Budget session 2026: గత 5 ఏళ్లలో ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ మూతపడ్డాయి? కేంద్ర మంత్రి లెక్కలకు మైండ్ బ్లాక్