NEET UG 2026 Fee Refund: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ యూజీ 2026 అభ్యర్థులకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. మే 3న జరిగిన పరీక్ష రద్దు కావడంతో, అభ్యర్థులకు ఫీజు రీఫండ్ చేసే ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. దీనికి సంబంధించిన రీఫండ్ పోర్టల్ లింక్ ప్రస్తుతం neet.nta.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.
ఎందుకు డబ్బులు వెనక్కి ఇస్తున్నట్టు!
దేశవ్యాప్తంగా వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీటి యూజీ 2026 పరీక్ష ఈ ఏడాది వివాదాలకు కేంద్ర బిందువైంది. మే 3న జరిగిన పరీక్ష పేపర్ లీక్ అయినట్టు నిర్దారణ కావడంతో విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎన్టీఏ ఆ పరీక్షను రద్దు చేసింది. ఈ క్రమంలో, విద్యార్థులకు జరిగిన అసౌకర్యాన్ని పరిగణలోకి తీసుకొని, పాతి ఫీజును రీఫండ్ చేయడమే లేదా తదుపరి ప్రక్రియకు సంబంధించిన వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది
రీఫండ్ ప్రక్రియ ఇదే
రీఫండ్ ప్రక్రియ సజావుగా సాగాలంటే అభ్యర్థులు తమ బ్యాంకు వివరాలను సిద్ధం చేసుకోవాలి. ఈ స్టెప్స్ ఫాలో చేసి వివరాలు నమోదు చేసుకోవాలి. నమోదు చేయాల్సిన వివరాలు
- ఖాతాదారుని పేరు
- ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్
- బ్యాంకు అకౌంట్ నెంబర్
- బ్యాంకు పేరు
- క్యాన్సిల్ చేసిన చెక్(ఇది ఆప్షనల్, కానీ అప్‌లోడ్ చేస్తే ధ్రువీకరణ ఈజీ అవుతుంది)
ముఖ్యమైన తేదీలు గడవు
అభ్యర్థులు గమనించాల్సిన ప్రధాన విషయం ఏంటంటే, ఈ రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి సమయం చాలా తక్కువగా ఉంది. రీఫండ్ విండో మే 22న ప్రారంభమైంది. చివరి తేదీ మే 27. ఈ గడువు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మార్పులకు, కొత్తగా అప్లై చేసుకోవడానికి వీలు ఉండదు.
రీఫండ్ కోసం దరఖాస్తు ఎలా చేయాలి?
అభ్యర్థులు ఎటువంటి పొరపాట్లు చేయకుండా రీఫండ్ పొందడానికి ఈ స్టెప్స్ ఫాలో కావాలి. మొదట ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in విజిట్ చేయాలి. తర్వాత మీ నీట్ యూజీ 2026 లాగిన్ వివరాలతో పోర్టల్‌లో ప్రవేశించాలి. అక్కడ హోమ్‌పేజీలో కనిపిస్తున్న NEET UG 2026 Fee Refund Linkపై క్లిక్ చేయాలి. అక్కడ అడిగిన మీ బ్యాంకు వివరాలను జాగ్రత్తగా నింపాలి. వివరాలన్నీ సరి చూసుకున్న తర్వాత సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఒకసారి సబ్‌మిట్ చేసిన తర్వాత మళ్లీ మార్చుకోవడానికి అవకాశం ఉండదు.
ఛార్జ్ బ్యాక్ వద్దు
రీఫండ్ ప్రక్రియకు సంబంధించిన ఎన్టీఏ అభ్యర్థులకు ఒక గట్టి హెచ్చరిక జారీ చేసింది. అభ్యర్థులు తమ బ్యాంకు ద్వారా నేరుగా ఛార్జ్ బ్యాక్ ప్రక్రియను ప్రారంభించవద్దని సూచించింది. కేవలం ఎన్టీఏ వెబ్‌సైట్ ద్వారానే అధికారికంగా రీఫండ్ క్లెయిమ్ చేసుకోవాలని కోరింది.
మళ్లీ పరీక్ష ఎప్పుడు
రద్దు చేసిన నీట్ యూజీ పరీక్షను తిరిగి నిర్వహించేందుకు ఎన్టీఏ ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసింది. జూన్ 21న జరిగే పరీక్ష కోసం కొత్త హాల్ టికెట్లు జారీ చేయనున్నారు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ నుంచి కొత్త హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి. విద్యార్థులు తమ రీఫండ్ ప్రక్రియను మే 27లోపు పూర్తి చేసుకొని జూన్ 21న జరగబోయే పరీక్షలు సిద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు.
