NEET UG Results 2025 : దేశవ్యాప్తంగా ఉన్న వైద్య విద్యా కాలేజీల్లో ప్రవేశం కోసం  నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించిన NEET UG 2025 ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాల మాట రావడంతో అభ్యర్థుల్లో ఒకట ఉత్కంఠకు తెరపడింది.  

NEET UG 2025 ఫలితాలను ఆదివారం విడుదల చేయబోతున్నట్టు అనుకున్నప్పటికీ ఇవాళే వెబ్‌సైట్‌లో పెట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న MBBS, BDS, AYUSH, ఇతర మెడికల్ కోర్సుల్లో చేరి ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏటా నిర్వహిస్తుంది. ఈసారి చేపట్టిన పరీక్షల్లో దాదాపు 24 లక్షల మంది రాశారు. ఈ రిజల్ట్స్‌ను neet.nta.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.  

నీట్‌ వెబ్‌సైట్‌లో ఈ ఫలితాలను జూన్ 14 , 2025న మధ్యాహ్నం  రెండు గంటల టైంలో విడుదల చేశారు. ఈ ఫలితాలను neet.nta.nic.in, nta.ac.in, ntaresults.nic.in వెబ్‌సైట్‌లలో ఉంచారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత అందులో టాపర్స్ లిస్ట్ పెట్టారు. ఆల్‌ ఇండియా రాంక్‌లు, మార్క్‌షీట్‌లు అందుబాటులో ఉన్నాయి. 

నీట్‌ 2024 ఫలితాలను కూడా జూన్ 14నే విడుదల చేశారు. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తరని అనుకున్నారు కానీ ముందుగానే విడుదల చేశారు. మే 4న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో నీట్ నిర్వహించారు.ఈ కేంద్రాల్లో 23.85 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. వీరిలో 13.5 లక్షల మంది బాలికలు ఉంటే 10.35 లక్షల మంది అబ్బాయిలు ఉన్నారు.

NEET UG 2025లో టాపర్‌ల జాబితా ఫలితాల విడుదల తర్వాత బయటకు వచ్చింది. ఇందులో గందరగోళం లేకుండా ఉండేందుకు టాపర్స్ జాబితాను ఎన్టీఏ వెబ్‌సైట్‌లో పెట్టింది. గతేడాది టాప్ 3లో రాహుల్ గ్రేస్ (720/720), అర్జున్ త్యాగి (715), శివం కుమార్ (714) ఉన్నారు. ఈసారి కూడా టాపర్లకు 700లకుపైగా మార్కులు వస్తాయనే అంచనాలు ఉన్నాయి. టాపర్‌ల జాబితాను దేశవ్యాప్తంగా ఒకటి ఉంటే, రాష్ట్రాల వారీగా కూడా వేరుగా ఉంటుంది. వీటితోపాటు ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయనే విషయాన్ని కూడా వెబ్‌సైట్‌లో ఉంచుతారు.   NEET UG 2025 ఫలితాల కోసం ముందుగా nta.ac.in, neet.nta.nic.in, ntaresults.nic.in వెబ్‌సైట్‌కు "NEET UG 2025 Result" అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. వెంటనే రిజల్ట్స్ పేజ్‌ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ రోల్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్ చేయాలి. తర్వాత సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేస్తే మీ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. అందులో మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, జాతీయ స్థాయిలో మీ ర్యాంకు ఎంత, రాష్ట్ర స్థాయిలో మీ ర్యాంకు ఎంతో తెలుస్తుంది. ఆ ఫలితాల షీట్‌ను డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలి. దీంతోపాటు ఓ స్కోర్ కార్డు కూడా వస్తుంది. ఇది కూడా కౌన్సెలింగ్ టైంలో చూపించాల్సి ఉంటుంది. ఈ రెండింటిని ప్రింట్‌ అవుట్ తీసి పెట్టుకోవాలి.  

ఫలితాల టైంలో ఏదైనా సమస్య వచ్చినా, ఇతర ఇబ్బందులు ఎదురైనా పరిష్కరించేందుకు NTA ఓ హెల్పలైన్ నెంబర్ తీసుకొచ్చింది. "NEET Helpline"పేరిట ఈ డెస్క్ పని చేస్తుంది. ఫోన్ నంబర్: 011-40759000 ఫోన్ చేయాల్సి ఉంటుంది.