నీట్ పీజీ కౌన్సెలింగ్ 2022 ఫైనల్ మెరిట్ జాబితాను మెడికల్ కౌన్సిల్ కమిటీ అక్టోబరు 19న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో రెండో రౌండ్ సీట్ల కేటాయింపు వివరాలను అందుబాటులో ఉంచింది. ఆలిండియా కోటాలో సీట్ల వివరాలను ప్రకటించింది. పీడీఎఫ్ ఫార్మాట్ సీట్ల కేటాయింపు ఫలితాలను ఎంసీసీ విడుదల చేసింది. అభ్యర్థులు కంప్యూటర్ కీబోర్డులో 'CTRL+F' క్లిక్ చేసి, సెర్చ్ బాక్సులో ర్యాంకు నమోదుచేయడం ద్వారా సీట్ల కేటాయింపు వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు. సీట్లు పొందిన అభ్యర్థులు సంబంధిత కళాశాల్లో అక్టోబరు 20 నుంచి 26 మధ్య రిపోర్ట్ చేసి, ప్రవేశ ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది.


NEET-PG Counselling Seats Allotment -2022 Round 2


మెడికల్ కౌన్సిల్ కమిటీ నీట్ పీజీ 2022 రెండో రౌండ్ ప్రొవిజినల్ జాబితాను అక్టోబరు 18న విడుదల చేసిన సంగతి తెలిసిందే. పీడీఎప్ ఫార్మాట్‌లోనే ఆ జాబితాను కూడా ఎంసీసీ విడుదల చేసింది. రెండో రౌండ్‌లో సీట్లు పొందిన అభ్యర్థుల వివరాలను అందులో వెల్లడించింది. తాజాగా ఫైనల్ మెరిట్ జాబాతాను ఎంసీసీ ప్రకటించింది. దీని తర్వాత మిగిలిన సీట్ల భర్తీకి మాప్-అప్ రౌండ్ నిర్వహించనుంది.


Counseling Schedule PG 2022  


NEET PG COUNSELLING INFORMATION BULLETIN & COUNSELLING SCHEME



 అఖిల భారత కోటాలో తొలివిడత పీజీ వైద్యవిద్య కౌన్సెలింగ్‌ సెప్టెంబరు 15 నుంచి 27 వరకు నిర్వహించారు. రెండోవిడత కౌన్సెలింగ్‌ అక్టోబరు 10 నుంచి 18 వరకు నిర్వహించారు. రాష్ట్ర స్థాయి పీజీ వైద్యవిద్య తొలివిడత కౌన్సెలింగ్‌ను సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 4 వరకు, రెండో విడత అక్టోబరు 15 నుంచి 26 వరకు వరకు నిర్వహిస్తారు.  మరోవైపు రాష్ట్రంలో 2022-23 వైద్యవిద్యా సంవత్సరానికి ప్రభుత్వ రంగంలో కొత్తగా 1200 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రానున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఇప్పటికే మహబూబాబాద్‌, జగిత్యాల, సంగారెడ్డి, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, కొత్తగూడెం వైద్య కళాశాలలకు ఒక్కో దాంట్లో 150 చొప్పున కొత్తగా 900 సీట్లకు అనుమతి లభించింది. రామగుండంలో 150 సీట్లకు అనుమతి ఇవ్వడానికి అంగీకార పత్రాన్ని (లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌) జాతీయ వైద్య కమిషన్‌ ఇప్పటికే పంపించింది. ఇక మంచిర్యాలకు మాత్రమే అనుమతి రావాల్సి ఉంది. ఈ కళాశాలకు కూడా 150 సీట్లు ఇచ్చే అవకాశాలున్నాయి.



:: Also Read ::


Degree Courses: డిగ్రీలో కొత్త కోర్సులు, వచ్చే ఏడాది నుంచి అమల్లోకి!
తెలంగాణలోని యూనివర్సిటీల్లో మూస విద్యావిధానానికి స్వస్తి పలకాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. వచ్చే ఏడాదికల్లా కొలువులిచ్చే కోర్సుల రూపకల్పనకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ముగ్గురు వైస్‌చాన్స్‌లర్లతో త్రిసభ్య కమిటీని నియమించింది. శాతవాహన వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ ఎస్‌.మల్లేశ్‌ చైర్మన్‌గా, ఉస్మానియా వీసీ ప్రొఫెసర్‌ డి.రవీందర్‌, మహత్మాగాంధీ వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ గోపాల్‌రెడ్డి సభ్యులుగా కమిటీ వేసింది.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..



Cyber Security: సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ, అర్హతలివే!

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 'నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ' సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణను దరఖాస్తులు కోరుతోంది. సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకింగ్, సర్టిఫికెట్‌ ఇన్ సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి ఉన్నవారు అక్టోబ‌రు 27 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు 7893141797 ఫోన్ నంబ‌రులో సంప్రదించవచ్చు. 
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..



CLISC: సీఎల్‌ఐఎస్సీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం, ఇంటర్ అర్హత!
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌర గ్రంధాలయాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో గుర్తింపు పొందిన మూడు సంస్థల ద్వారా నిర్వహించనున్న 5 నెలల కాలపరిమితితో కూడిన సర్టిఫికెట్‌ కోర్స్ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్పర్మేషన్‌ సైన్స్‌ కోర్సులో చేరేందుకు ఆసక్తిగల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతుంది. 
కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..