NEET PG 2022 Result:  మెడికల్ పీజీ కోర్సుల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్షా ఫలితాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. . ఈ విషయాన్ని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీట్ ట్వీట్ ద్వారా తెలిపారు.  ఫలితాలను natboard.edu.in ఈ వెబ్ సైట్ లో చూసుకోవచ్చు.  


 



నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG 2022) ప‌రీక్ష మే 21న నిర్వ‌హించారు.  వెంటనే ఫలితాలు ప్రకటించారు.కొన్ని కారణాల వల్ల పరీక్ష వాయిదా వేయాలన్న డిమాండ్లు విద్యార్థుల  నుంచి వచ్చాయి. సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే పరీక్ష వాయిదా వేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.  NEET PG 2022 పరీక్ష తేదీని వాయిదా వేయబోమని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW) కూ డా స్పష్టం చేసింది. ఆ మేరకు పరీక్షను నిర్వహించింది. వేగంగా ఫలితాలను కూడా ప్రకటించింది.  పరీక్షను వాయిదా వేయాలని ఓ వర్గం.. వద్దని మరో వర్గం పట్టుబట్టాయి. అయితే  పరీక్ష కోసం సన్నద్ధమైన 2 లక్షల 6 వేల మంది విద్యార్థులున్న మరో పెద్ద వర్గానికి నష్టం జరుగుతుంది. అందుకే కేంద్రం వాయిదాకు అంగీకరించలేదు.  కరోనా కారణంగా అనేక ఎంట్రన్స్‌ల  షెడ్యూల్​ ప్రభావితమైంది. దానిని పునరుద్ధరించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.   అందుకే కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.    


ఎగ్జామ్ మార్కులు విధానం 
నీట్ ఎండీఎస్ 2022 లో 240 ప్రశ్నలు (NEET MDS 2022 Pattern) ఉంటాయి. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలలో సరైన సమాధానాన్ని ఎంపిక చేసి సమాధానం ఇవ్వాలి. అయితే ఈ ఎంట్రన్స్ కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే నిర్వహిస్తారు. పరీక్ష గడువు మూడు గంటల సమయం. ఎండీఎస్ ఎగ్జామ్‌లో 25 శాతం నెగటివ్ మార్కింగ్ ఉంది. నాలుగు ప్రశ్నలకు తప్పు సమాధానం ఇస్తే ఒక్క మార్కు నెగటివ్ అవుతుంది. ఈ ప్రకారం వాల్యూయేషన్ చేసి ర్యాంకులు కేటాయించారు.