యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2022 (యూజీసీ- నెట్‌) సమాధానాల తుది ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఏప్రిల్‌ 6న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా ఆన్సర్ కీ చూసుకోవచ్చు. యూజీసీనెట్ పరీక్షను దేశవ్యాప్తంగా 663 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 83 సబ్జెక్టుల్లో ఫిబ్రవరి 21 నుంచి మార్చి 16 వరకు నిర్వహించారు. మొత్తం 8,34,537 అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. తుది ఆన్సర్ కీ వెలువడిన నేపథ్యంలో త్వరలోనే ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉంది. 


యూజీసీ నెట్-2023 ఆన్సర్ 'కీ' కోసం క్లిక్ చేయండి..



యూజీసీ నెట్-2023 పరీక్ష ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మార్చి 23న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా ఆన్సర్ కీ చూసుకోవచ్చు. అభ్యర్థులు అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఆన్సర్ కీ చూసుకోవచ్చు. ఆన్సర్ కీతోపాటు ప్రశ్నపత్రాలను కూడా అందుబాటులో ఉంచారు.


నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫిబ్రవరి 21 నుంచి మార్చి 21 వరకు ఆన్‌లైన్ విధానంలో యూజీసీ నెట్- డిసెంబరు 2023 పరీక్షను నిర్వహించి సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 186 నగరాల్లో 663 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించింది. మొత్తం 83 సబ్జెక్టులకు నిర్వహించిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా మొత్తం 8.34 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని తాజాగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఆన్సర్ కీపై అభ్యంతరాలకు అవకాశం కల్పించింది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఫైనల్ కీతోపాటు పరీక్ష ఫలితాలను కూడా ఎన్టీఏ విడుదల చేయనుంది.


దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తుంటుంది. కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏటా రెండుసార్లు (జూన్, డిసెంబరు) యూజీసీ నెట్ పరీక్షలకు ఎన్టీఏ నోటిఫికేషన్ విడుదల చేస్తారు.


Also Read:


SRTRI: నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ, ఆపై ఉద్యోగాలు!
తెలంగాణ‌లోని గ్రామీణ నిరుద్యోగ యువతకు వివిధ కోర్సులో ఉచిత నైపుణ్య శిక్షణ కోసం యాదాద్రి భువనగిరి జిల్లా జలాల్‌పూర్ గ్రామంలోని స్వామి రామానందతీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ దరఖాస్తులు కోరుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకమైన 'దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన' కింద ఈ శిక్షణ కొనసాగనుంది. ఈ నైపుణ్య కోర్సులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉండి.. 8వ తరగతి, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు ఉచిత నివాస, భోజన వసతులు కల్పిస్తారు. ఈ శిక్షణ కోర్సుల్లో ప్రవేశాలు కోరేవారు ఒరిజినల్ సర్టిఫికేట్లతో ఏప్రిల్ 10న సంస్థలో హాజరుకావాల్సి ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఇంటర్ అకడమిక్ ​క్యాలెండర్​ విడుదల, ఈ ఏడాది వచ్చే సెలవులివే!
తెలంగాణలో జూనియర్ కళాశాలల అకడమిక్ ​క్యాలెండర్​ని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని జూనియర్​ కళాశాలలు జూన్​ 1న ప్రారంభమవుతాయిన బోర్డు అధికారులు ఏప్రిల్ 1న వెల్లడించారు. జూన్ 1 నుంచే తరగతులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక విద్యా క్యాలెండర్ బోర్డు వెలువరించింది.
అకడమిక్ క్యాలెండర్ కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..