జేఈఈ మెయిన్-2023 మొదటి సెషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 12తో ముగిసిన సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలను జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్ పరీక్షల నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తోంది. మొదటి విడత పరీక్షల అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 18న ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ను ఎన్టీఏ విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. సిటీ ఇంటిమేషన్ స్లిప్‌‌లో అభ్యర్థి పరీక్ష రాసే నగరం, పరీక్ష తేది వివరాలు ఉంటాయి.


Advance City Intimation Slip Download..


జనవరి 19 నుంచి జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇక రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభంకానుంది. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే 011-40759000/011-69227700 ఫోన్ నెంబర్లు లేదా ఈమెయిల్: jeemain@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు.


దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షల నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 24 నుంచి 31 తేదీ వరకు మొదటి విడత పరీక్షలు జరగనున్నాయి. అడ్మిట్ కార్డుపై సెంటర్, తేదీ, షిష్ట్ వంటి వివరాలు ఉంటాయి. 


JEE Main 2023 అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ ఇలా..


అడ్మిట్ కార్డుల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి - jeemain.nta.nic.in 


➥ హోంపేజీలో జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు 2023 సెషన్‌-1కు సంబంధించి లింక్‌పై క్లిక్ చేయాలి.


మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో లాగిన్ అవ్వాలి.


➥ జేఈఈ మెయిన్ అడ్మిట్‌కార్డు స్క్రీన్‌పై కనబడుతుంది.


ఆ తర్వాత దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓ కాపీని ప్రింటవుట్ తీసుకుని పెట్టుకోవాలి.


➥ కార్డుపై మీరు పరీక్ష రాసే నగరం, ఇతర వివరాలన్నీ ఉన్నాయో లేదో సరిచూసుకోండి.


జేఈఈ తేదీలివే..
దేశంలోని ట్రిపుల్ ఐటీలు, ఎన్‌ఐటీ, ఇతర విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్ పరీక్షలను దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు రాస్తుంటారు. మెయిన్‌లో అర్హత సాధించిన వారికి అడ్వాన్స్‌లో నిర్వహిస్తారు. అందులో వచ్చే ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్ పరీక్షలను రెండు విడతల్లో నిర్వహిస్తున్న ఎన్‌టీఏ.. జనవరిలో తొలి విడత, ఏప్రిల్‌లో రెండో విడత పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. తొలి సెషన్‌ను జనవరి 24, 25, 27, 29, 29, 30, 31 తేదీల్లో నిర్వహించనుండగా.. రెండో సెషన్ ఏప్రిల్ 6 నుంచి 12 వరకు జరుగుతుందని ఎన్‌టీఏ తెలిపింది.

పరీక్ష విధానం:

జేఈఈ మెయిన్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఎన్‌ఐటీలు, ఐఐటీలు, ఇతర జాతీయ విద్యాసంస్థల్లో యూజీ కోర్సు్లో (బీఈ/బీటెక్) ప్రవేశాల కోసం పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌‌డ్ కోసం కూడా దీన్నే అర్హత పరీక్షగా పరిగణిస్తారు. 

➥ ఇక బీఆర్క్, బీప్లానింగ్ కోర్సు్ల్లో ప్రవేశాల కోసం పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్-2023 పరీక్షను మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మలయాళం, కన్నడ, మరాఠి, ఒడియా, తమిళం, తెలుగు, ఉర్దూ, పంజాబీ భాషల్లో పరీక్ష ఉంటుంది.


బీఈ, బీటెక్‌, బీఆర్క్‌, ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్‌ పరీక్షలను దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు రాస్తుంటారు. వీరిలో మంచి స్కోర్‌ సాధించిన 2.5 లక్షల మంది విద్యార్థులకు ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు.


ముఖ్యమైన తేదీలివే..


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.12.2022.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 12.01.2023.  (9:00 P.M.)


ఫీజు చెల్లించడానికి చివరితేది: 12.01.2023.  (11:50 P.M.)


➥ సిటీ ఎగ్జామినేషన్ వివరాల వెల్లడి: 2023, జనవరి రెండోవారంలో. 


అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్: 2023, జనవరి మూడోవారంలో. 


➥ పరీక్ష తేది: 2023, జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో.


ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ల వెల్లడి: తర్వాత ప్రకటిస్తారు.


JEE (Main) – 2023 Schedule 
JEE (Main) - 2023 Notification
Eligibility Criteria


JEE (Main) – 2023 Online Application


Official Website 


Also Read: 


జేఈఈ మెయిన్ మాక్ టెస్టులు అందుబాటులో! ఎలా యాక్సెస్ చేయాలంటే?
జేఈఈ మెయిన్ పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల సౌలభ్యం కోసం మాక్ టెస్టులు అందుబాటులోకి వచ్చాయి. నేషనల్ టెస్ట్ అభ్యాస్ మొబైల్ యాప్‌లో ఈ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభ్యాస్ యాప్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానాన్ని పరిచయం చేయడానికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. జేఈఈ మెయిన్య 2023 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఉచితంగానే ఈ మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయవచ్చు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..