నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ప్రవేశాలకు నిర్దేశించిన 'NIFT-2023' రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబరు 1న ప్రారంభమైంది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబరు 31 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.3000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1500 చెల్లిస్తే సరిపోతుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది (2023) ఫిబ్రవరి 5న NIFT-2023 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో అవసరమైన అన్ని డాక్యుమెంట్లు(సర్టిఫికేట్స్) అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆర్టీసన్ కోర్సుల దరఖాస్తుకు మార్చి 12, పీహెచ్‌డీ కోర్సులకు దరఖాస్తుకు ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలు..

* నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ప్రవేశాలు (NIFT - 2023)

కోర్సులు..

1) అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు

2) పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు 

3) ఆర్టీషిసన్స్/ చిల్డ్రన్ ఆప్ ఆర్టీసన్స్ 

4) పీహెచ్‌డీ కోర్సు

అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యా్ర్హత, పీజీ కోర్సులకు డిగ్రీ అర్హత ఉండాలి. పీహెచ్‌ కోర్సుకు సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 01.08.2023 నాటికి 24 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు వయోపరిమితిలో 5 సంవత్సరాల సడలింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: NIFT-2023 ప్రవేశ పరీక్ష ద్వారా.

ఇలా దరఖాస్తు చేసుకోవాలి...

Step 1- దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి - nift.ac.in 

Step 2- లాగిన్ వివరాలను నమోదుచేయాలి. 

Step 3- అక్కడ రిజిస్ట్రేషన్ పేజీలో అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలు, చిరునామా, ఇతర అవసరమైన అన్ని వివరాలు సమర్పించాలి.

Step 4- NIFT 2023 పరీక్ష కేంద్రాన్ని ఎంపికచేసుకోవాలి.

Step 5-  అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. 

Step 6- నిర్ణీత ఫీజు చెల్లించి, దరఖాస్తులను సమర్పించాలి. 

Step 7- దరఖాస్తుల్లో ఏమైనా పొరపాట్లు చేస్తే, సరిచేసుకోవడానికి జనవరి మొదటివారంలో అవకాశం కల్పిస్తారు. ఇందుకోసం కరెక్షన్ విండో ఏర్పాటుచేస్తారు.

దరఖాస్తు సమయంలో అవసరమయ్యే డాక్యుమెంట్లు, ఇతరాలు..

➥ అభ్యర్థులక ఈమెయిల్ ఐడీ కచ్చితంగా ఉండాలి.

➥ విద్యార్హత సర్టిఫికేట్లు

➥ వ్యక్తిగత వివరాలకు సంబంధించిన ధ్రువపత్రాలు. 

➥ డిజెబిలిటీ సర్టిఫికేట్. 

➥ కుల ధ్రువీకరణ ధ్రువపత్రం (ST/ SC/ OBC వారికి) 

➥ అభ్యర్థి సంతకంతో కూడిన స్కానింగ్ చేసిన ఇమేజ్.

➥ స్కానింగ్ చేసిన ఫొటోగ్రాఫ్.

➥ ఆన్‌లైన్ పేమెంట్స్ చేసేటప్పుడు అవసరమయ్యే క్రెడిట్/డెబిట్ కార్డు.

 

ముఖ్యమైన తేదీలు (డిగ్రీ, పీజీ కోర్సులు)..

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం: 01.11.2022.

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 31.12.2022.

➥ రూ.5000 ఆలస్యరుసుముతో రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 2023, జనవరి మొదటివారం.

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం (కరెక్షన్ విండో): 2023, జనవరి రెండోవారం.

➥ అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్: 2023, జనవరి మూడోవారం.

➥ NIFT 2023 డిగ్రీ, పీజీ ప్రవేశ పరీక్ష తేది: 05.02.2023.

➥ ఆన్సర్ కీ, క్వశ్యన్ పేపర్ల వెల్లడి: 2023 ఫిబ్రవరి రెండోవారంలో.

➥ ఫలితాల వెల్లడి: 2023, మార్చిలో.

➥ సిట్యుయేషన్ టెస్ట్/ ఇంటర్వ్యూ: ఏప్రిల్, 2023లో.

➥ ఎన్నారై, ఫారిన్ అభ్యర్థుల దరఖాస్తుకు చివరితేది: 30.04.2023.

➥ తుది ఫలితాల వెల్లడి: మే, 2023.

➥ సీట్ల కేటాయింపు: 2023 మే-జూన్.

Notification

NIFT-2023 Online Application Direct link

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..