గుంటూరులోని ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి అగ్రికల్చర్ కోర్సుల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రవేశాలు కోరువారు నిర్ణీత నమూనాలో రూ.200 విలువచేసే నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్‌పై అండర్‌టేకింగ్ ఇవాల్సి ఉంటుంది.



వివరాలు..

* ఎన్నారై కోటా ప్రవేశాలు

కోర్సులు..

➥ బీఎస్సీ (హానర్స్) అగ్రికల్చర్
    సీట్ల సంఖ్య: 122


➥ బీఎస్సీ (హానర్స్) కమ్యూనిటీ సైన్స్
     సీట్ల సంఖ్య: 14

➥ బీటెక్ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్)
     సీట్ల సంఖ్య: 18 

➥ బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ)
     సీట్ల సంఖ్య: 18 

అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎన్నారై సిటిజన్ అయి ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రులు విదేశాల్లో ఉంటున్న భారతీయులై ఉండాలి. శాశ్వత పౌరసత్వం ఉండాలి. విదేశాల్లో ఉద్యోగం లేదా వ్యాపారం ఉండాలి. 

వయోపరిమితి:  31.12.2023 నాటికి 17-22 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో.


ఎంపిక విధానం: అర్హతలు, ఇతర నిబంధనల ఆధారంగా.


దరఖాస్తు ఫీజు: రూ.2000. “Comptroller, ANGRAU” పేరిట గుంటూరులో చెల్లుబాటులో అయ్యేలా డిడి తీయాలి.


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Registrar, 
Acharya N.G. Ranga Agricultural University,
Administrative Office, 
Lam, Guntur - 522 034, A.P.


దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 09.10.2023. (4 PM)


Notification & Application


ALSO READ:


నిమ్స్‌'లో ఫిజియోథెరపీ పీజీ కోర్సులో ప్రవేశాలు, పరీక్ష ఎప్పుడంటే?
హైదరాబాద్‌లోని నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, 2023 విద్యా సంవత్సరానికి మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ(ఎంపీటీ) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 7లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. 
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సు, సీట్ల వివరాలు ఇలా!
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ) 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌(బీడిజైన్‌) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌, అహ్మదాబాద్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, అసోంలో ఉన్న ఎన్‌ఐడీ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 1లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో మాస్టర్ డిగ్రీ కోర్సు, వివరాలు ఇలా
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ) 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల మాస్టర్ ఆఫ్‌ డిజైన్‌(బీడిజైన్‌) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అహ్మదాబాద్‌, బెంగళూరు, గాంధీనగర్‌‌లో ఉన్న ఎన్‌ఐడీ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 1లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...