ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా ఎంబీబీఎస్‌ సీట్లకు వెబ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నవంబరు 30న విడుదల చేసింది. నవంబరు 30న రాత్రి 7 గంటల నుంచి డిసెంబరు 1న రాత్రి 7 గంటల వరకు అభ్యర్దులు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. సీట్ల ఖాళీల వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ప్రాధాన్యతా క్రమంలో కళాశాల వారీగా వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.


MBBS ADMISSIONS: NOTIFICATION FOR EXERCISING WEB-OPTIONS FOR SECOND PHASE OF COUNSELING


కౌన్సెలింగ్ వెబ్‌సైట్


నర్సింగ్‌, కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల
మరోవైపు ఎంఎస్సీ నర్సింగ్‌, ఎంపీటీ కన్వీనర్‌ కోటా సీట్లకు భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నవంబరు 30న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిసెంబర్‌ 1న ఉదయం 8 గంటల నుంచి డిసెంబరు 7న సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని వారు సూచించారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు పరిశీలించిన అనంతరం తుది మెరిట్‌ జాబితాను విడుదల చేస్తారు. 


MSc (NURSING) ADMISSIONS NOTIFICATION FOR ONLINE REGISTRATION

MPT ADMISSION NOTIFICATION FOR ONLINE REGISTRATION 

Online Application 


Also Read:


ఆంధ్రా యూనివర్సిటీలో ఆడియో, మ్యూజిక్ కోర్సులు - వివరాలివే!
ఏపీలోని ఆంధ్రా యూనివర్సిటీ ఆడియో, మ్యూజిక్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. సెయింట్ ల్యూక్స్ ఆడియో ఇంజినీరింగ్ & మ్యూజిక్ ప్రొడక్షన్‌తో కలిసి ఏయూ ఈ కోర్సులకు శ్రీకారం చుట్టింది. వీటిలో 3 నెలలు, 6 నెలలు, ఏడాది కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు 6 నెలల, ఏడాది, రెండేళ్ల కాలపరిమితిలో వోకల్ ట్రైనింగ్, ఇన్‌స్ట్రుమెంట్ కోర్సులను కూడా అందిస్తున్నాయి. 
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..


క్రాఫ్ట్స్ & డిజైనింగ్ కోర్సుల్లో ప్రవేశాలు, ఐఐసీడీ నోటిఫికేషన్ జారీ!!
ఇండియన్  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్ (ఐఐసీడీ) 2023 విద్యాసంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా బీ.డిజైన్, ఎం.డిజైన్, ఎం.వొకేషన్ కోర్సుల్లో సీట్ల భర్తీ చేయనున్నారు. కోర్సుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. డిగ్రీ కోర్సులకు ఇంటర్ అర్హత ఉండాలి. పీజీ కోర్సులకు సంబంధి విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సరైన అర్హతలున్న అభ్యర్ధులు జనవరి 21లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


'ఫ్యాషన్' కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రారంభం- చివరితేది ఎప్పుడంటే?
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ప్రవేశాలకు నిర్దేశించిన 'NIFT-2023' రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబరు 1న ప్రారంభమైంది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబరు 31 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.3000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1500 చెల్లిస్తే సరిపోతుంది. 
నోటిఫికేషన్, కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..