Telangana AGRICET & AGRIENGGCET 2024 Notification: హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 2024-25 విద్యాసంవత్సరానికిగాను బీఎస్సీ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు అగ్రిసెట్, అగ్రి ఇంజినీరింగ్ సెట్-2024 నోటిఫికేఫన్‌ను విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లను భర్తీచేస్తారు. డిప్లొమా అర్హత ఉన్న అభ్యర్థులకు వ్యవసాయ వర్సిటీ పరిధిలో బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్ డిగ్రీ, బీటెక్ (అగ్రి ఇంజినీరింగ్) డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం సీట్లలో 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకు, మిగతా 15 శాతం అన్ రిజర్వ్‌డ్ కేటగిరీ కింద కేటాయిస్తారు.
అభ్యర్థులు ఆగస్టు 9 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆలస్యరుసుముతో ఆగస్టు 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1400 చెల్లించాలి. ఆలస్యరుసుముతో అయితే రూ.2100 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.700 చెల్లించాలి. అయితే ఆలస్యరుసుముతో రూ.1050 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు ఆగస్టు 24న ఆన్‌లైన్ విధానంలో ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. అగ్రిసెట్ పరీక్షను తెలుగు, ఇంగ్లిష్ మాధ్యామాల్లో, అగ్రి ఇంజినీరింగ్ సెట్ పరీక్షను కేవలం ఇంగ్లిష్ మాధ్యమంలోనే నిర్వహిస్తారు.
వివరాలు..
అగ్రిసెట్-2024 & అగ్రి ఇంజినీరింగ్ సెట్-2024 (AGRICET & AGRIENGGCET - 2024 )
* అగ్రిసెట్ (AGRICET)-2024
సీట్ల సంఖ్య: 92.
సీట్ల కేటాయింపు: అగ్రికల్చర్ డిప్లొమా విద్యార్థులకు 76 సీట్లు, సీడ్ టెక్నాలజీ విద్యార్థులకు 7 సీట్లు, ఆర్గానిక్ అగ్రికల్చర్/ ఆర్గానిక్ ఫార్మింగ్ విద్యా్ర్థులకు 9 సీట్లు కేటాయించారు. ఇక ఈడబ్ల్యూఎస్ కోటా కింద 9, సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కింద 34 సీట్లు కేటాయించారు.
అర్హత: తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల నుంచి డిప్లొమా (అగ్రికల్చర్/ సీడ్ టెక్నాలజీ/ ఆర్గానిక్ అగ్రికల్చర్/ ఆర్గానిక్ ఫార్మింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 31.12.2024 నాటికి 17 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 25 సంవత్సరాల వరకు; దివ్యాంగులకు 27 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
ALSO READ: పీజీఈసెట్-2024 కౌన్సెలింగ్ షెడ్యూలు వెల్లడి, రిజిస్ట్రేషన్ ఎప్పటినుంచంటే?
* అగ్రి ఇంజినీరింగ్ సెట్ (AGRIENGGCET) - 2024
మొత్తం సీట్లు: 8. ఇందులో ఈడబ్ల్యూఎస్ కోటా కింద 1, సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కింద 1 సీటు కేటాయించారు.
అర్హత: తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల నుంచి డిప్లొమా (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 31.12.2024 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 25 సంవత్సరాల వరకు; దివ్యాంగులకు 27 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: రూ.1400; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.700 చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు డిప్లొమా స్థాయిలో చదివిన అంశాల నుంచే ప్రశ్నలు అడుగుతారు.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్.
ముఖ్యమైన తేదీలు..
⫸ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09.08.2024.
⫸ ఆలస్య రుసుముతో దరఖాస్తు ప్రారంభం: 10.08.2024.
⫸ ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 12.08.2024.
⫸ ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 24.08.2024. (2.30 PM to 04.10 PM.)
⫸ ఆన్సర్ కీ అందబాటులో: 28.08.2024 నుంచి 29.08.2024 వరకు.