తెలంగాణలో ఆయుష్‌ పీజీ వైద్య సీట్ల భర్తీకి కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం అక్టోబరు 10న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏఐఏపీజీఈటీ-2023 పరీక్షలో అర్హత సాధించిన వారు దరఖాస్తుకు అర్హులు. పీజీ ఆయుర్వేదం, హోమియో, యునానీ కోర్సుల్లో కన్వీనర్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్‌లో అక్టోబరు 11న ఉదయం 9 గంటల నుంచి అక్టోబరు 17న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 


వివరాలు..


* ఆయుష్ పీజీ ప్రవేశాలు (కన్వీనర్ కోటా)


➥ ఎండీ ఆయుర్వేదం


➥ ఎండీ హోమియో


➥ ఎండీ యునానీ


అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీతోపాటు ఏఐఏపీజీఈటీ-2023 ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. జనరల్ అభ్యర్థులకు 50 శాతం పర్సంటైల్, ఓసీ దివ్యాంగులకు 45 శాతం పర్సంటైల్, ఎస్సీ-ఎస్టీ-బీసీ అభ్యర్థులకు 40 శాతం పర్సంటైల్ ఉండాలి. 31.10.2023 నాటికి ఇంటర్నషిప్ పూర్తిచేసి ఉండాలి. ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.


రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు: ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.4000, ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులు రూ.3000 చెల్లించాలి. తెలంగాణ, ఏపీ వెలుపల యూజీ డిగ్రీ పూర్తిచేసినవారు కౌన్సిల్ ఎదుట ధ్రువపత్రాల పరిశీలను చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందుకుగాను వెరిఫికేషన్ ఫీజు కింద విదేశీ విద్యార్థులైతే రూ.5000, ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులైతే రూ.3000 చెల్లించాల్సి ఉంటుంది. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, ఏఐఏపీజీఈటీ-2023 ర్యాంకు ఆధారంగా.


సందేహాల పరిష్కారానికి హెల్ప్‌లైన్ సేవలు..


➥ దరఖాస్తు సమయంలో విద్యార్థులకు ఏమైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే 9392685856, 7842542216, 9059672216 ఫోన్ నెంబర్లలో, లేదా ఈమెయిల్:  tsayush2023@gmail.com ద్వారా సంప్రదించవచ్చు. 


➥ నిబంధనలకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే 9490585796, 7901098840 ఫోన్ నెంబర్లలో, లేదా ఈమెయిల్: knrugadmission@gmail.com ద్వారా సంప్రదించవచ్చు. 


➥ నిర్దేశిత తేదీల్లో ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు మాత్రమే హెల్ప్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.10.2023 (9.00 AM.)


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 17.10.2023 (5 PM.)


ADMISSION INTO M.D. (AYURVEDA) COURSES FOR 2023-24 UNDER COMPETENT AUTHORITY QUOTA – PROSPECTUS
ADMISSION INTO M.D. (AYURVEDA) COURSES FOR 2023-24 UNDER COMPETENT AUTHORITY QUOTA - NOTIFICATION 


M.D. (HOMOEO) COURSES FOR 2023-24 UNDER COMPETENT AUTHORITY QUOTA – PROSPECTUS
M.D. (HOMOEO) COURSES FOR 2023-24 UNDER COMPETENT AUTHORITY QUOTA - NOTIFICATION


M.D. (UNANI) COURSES FOR 2023-24 UNDER COMPETENT AUTHORITY QUOTA – PROSPECTUS
M.D. (UNANI) COURSES FOR 2023-24 UNDER COMPETENT AUTHORITY QUOTA - NOTIFICATION


ONLINE APPLICATION


ALSO READ:


బీపీటీ, బీఎస్సీ పారామెడికల్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల
ఏపీలో 2023-24 విద్యాసంవత్సరానికి బీపీటీ, బీఎస్సీ పారా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి డా.వైఎస్సార్‌ హెల్త్ యూనివర్సిటీ అక్టోబరు 8న నోటిఫికేషన్ విడుదల చేసింది. బీపీటీతో పాటు వివిధ బీఎస్సీ పారామెడికల్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కాంపిటెంట్‌ అథారిటీ కోటా సీట్ల భర్తీకి అక్టోబర్‌ 8 నుంచి 19 వరకు అర్హులైన ఇంటర్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


డా.వైఎస్సార్‌ హెల్త్‌ వర్సిటీలో బీఎన్‌వైఎస్‌ కోర్సు, వివరాలు ఇలా
విజయవాడలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కు అనుబంధంగా ఉన్న కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి బీఎన్‌వైఎస్ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్(బైపీసీ) ఉత్తీర్ణులైనవారు దరఖాస్తుకు అర్హులు. ఇంటర్‌ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులు అక్టోబర్ 12లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు 'స్పాట్‌' కౌన్సెలింగ్‌, ఎప్పుడంటే?
గుంటూరులోని ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో 2023-24 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి అక్టోబర్ 11న స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈమేరకు వర్సిటీ రిజిస్ట్రార్‌ జి.రామారావు అక్టోబరు 6న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా ఇంజినీరింగ్, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానం కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయనున్నారు. గుంటూరులోని లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం లాంఫాం పాలిటెక్నిక్‌ విభాగంలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...