తెలంగాణలో పీజీ డెంటల్ (ఎండీఎస్‌) కోర్సుల్లో మేనేజ్‌మెంట్ కోటాలో ప్రవేశాలకుగాను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆగస్టు 8న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జాతీయస్థాయి అర్హత పరీక్ష నీట్‌-ఎండీఎస్‌-2023 అర్హత సాధించిన అభ్యర్థులు పీజీ ఎండీఎస్‌ డిగ్రీ సీట్లకు నమోదు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆగస్టు 9న ఉదయం 8 గంటల నుంచి 16న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. నీట్ పీజీ మేనేజ్‌మెంట్ కోటా ప్రవేశాలకు కోరు అభ్యర్థులు నిర్దేశిత దరఖాస్తు పూర్తిచేయడంతో పాటు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్‌ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. 


వివరాలు..


* ఎండీఎస్‌ - యాజమాన్య కోటా ప్రవేశాలు


అర్హత: నీట్ ఎండీఎస్ 2023 అర్హత ఉండాలి. డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు విద్యాసంస్థ నుంచి బీడీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. జూన్ 30 నాటికి ఇంటర్న్‌షిప్ పూర్తయి ఉండాలి.


కటాఫ్ స్కోరు ఇలా..


➥ జనరల్ - 50 పర్సంటైల్- 272 స్కోరు


➥ ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ & దివ్యాంగులు - 40 పర్సంటైల్- 238 స్కోరు


➥ ఓసీ దివ్యాంగులు - 45 పర్సంటైల్- 255 స్కోరు.


రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.6300. ఇతర రాష్ట్రాలో బీడీఎస్ చేసినవారికి రూ.5000, ఇతర దేశాల్లో బీడీఎస్ చేసినవారికి రూ.7000 ఫీజుగా నిర్ణయించారు.


దరఖాస్తు విధానం: ఆన్‌‌లైన్ ద్వారా.


ప్రవేశ విధానం: నీట్-పీజీ కటాఫ్ మార్కులు, ఇతర అర్హతల ఆధారంగా.


దరఖాస్తు సమయంలో అవసరమయ్యే సర్టిఫికేట్లు ఇవే..



  • నీట్ ఎండీఎస్ 2023 ర్యాంకు కార్డు, అడ్మిట్ కార్డు

  • బర్త్ సర్టిఫికేట్ (పదో తరగతి మార్కుల మెమో)

  • బీడీఎస్ సర్టిఫికేట్ (ఒరిజినల్/ప్రొవిజినల్)

  • బీడీఎస్ స్టడీ సర్టిఫికేట్లు

  • క్యాస్ట్ సర్టిఫికేట్

  • ఇంటర్న్‌షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్

  • పర్మనెంట్ డెంటల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్

  • ఎన్నారై స్పాన్సర్‌షిప్ సర్టిఫికేట్-డిక్లరేషన్ ఫామ్ (ఎన్నారై కోటా)

  • ఎన్నారై స్టేటస్ సర్టిఫికేట్ (ఎన్నారై కోటా)

  • ఫైనాన్షియల్ సపోర్టర్ ఎన్నారై బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ కాపీ సర్టిఫికేట్ (ఎన్నారై కోటా)

  • ఎన్నారై ఫైనాన్షియర్ పాస్‌పోర్ట్ కాపీ (ఎన్నారై కోటా) 

  • సంబంధిత కళాశాల నుంచి స్పాన్సర్‌షిప్ సర్టిఫికేట్  

  • అభ్యర్థి పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, ఇతర అవసరమైన అన్ని సర్టిఫికేట్లు.


సందేహాల పరిష్కారానికి హెల్ప్‌లైన్ సేవలు..


➥ వెబ్‌కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులకు ఏమైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే 9392685856, 7842542216, 9059672216 ఫోన్ నెంబర్లలో, లేదా ఈమెయిల్: tspgmed2023@gmail.com ద్వారా సంప్రదించవచ్చు. 


➥ నిబంధలనలకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే 9490585796, 7901098840 ఫోన్ నెంబర్లలో, లేదా ఈమెయిల్: knrugadmission2023@gmail.com ద్వారా సంప్రదించవచ్చు. 


➥ ఫీజు చెల్లింపు సమయంలో సమస్యలు ఎదురైతే 9959101577 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు. 


➥ నిర్దేశిత తేదీల్లో ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు మాత్రమే హెల్ప్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి.


NOTIFICATION


ONLINE APPLICATION


PROSPECTUS


ALSO READ:


ఎంపీసీ విద్యార్థులకు 'స్పెషల్ కౌన్సెలింగ్‌' ద్వారా ఫార్మసీ సీట్ల కేటాయింపు
తెలంగాణలో రెండు విడతల ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 2తో ముగిసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 4 నుంచి చివరివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆ తర్వాత ఆగస్టు 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్‌ మొదలుకానుంది. ఈ కౌన్సెలింగ్ ద్వారా ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులు బీఫార్మసీ, ఫార్మా-డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. సాధారణంగా ఏటా ఎంసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌లో వారికి సీట్లు కేటాయిస్తూ వస్తున్నారు. ఈసారి చివరి విడత తర్వాత ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో అవకాశం ఇచ్చేలా మార్పు చేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


తిరుపతి స్విమ్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్ కోర్సులు, వివరాలు ఇలా!
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్‌ యూనివర్సిటీ) 2022-23 విద్యా సంవత్సరానికి గాను పోస్ట్‌ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్/ తెలంగాణకు చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సంబంధిత విభాగంలో బీఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


కాళోజీ  హెల్త్ వర్సిటీలో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కోర్సు, డిగ్రీ అర్హత చాలు
తెలంగాణలో మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (ఎంపీహెచ్‌) కోర్సులో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లను భర్తీ చేస్తారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 1 నుంచి 13 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. కంప్యూటర్‌ ఆధారిత ప్రవేశపరీక్షను ఆగస్టు 27న నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 2న ఫలితాలు వెల్లడించనున్నారు. 
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..