రాష్ట్రంలోని ప్రైవేట్‌ ఎండీ హోమియో వైద్యసీట్ల భర్తీకి వెబ్‌ఆప్షన్లకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదలచేసింది. పీజీ హోమియో కోర్సులో యాజమాన్య కోటా సీట్లను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు. అభ్యర్ధులు నమోదు చేసిన ఇట్టి వన్‌టైం ఆప్షన్ల ద్వారా అన్ని విడతల కౌన్సెలింగ్‌లకు సీట్లకేటాయింపులు జరపనున్నారు. అర్హులైన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 15న ఉదయం 9 గంటల నుంచి 16న సాయంత్రం 6 గంటల వరకు వెబ్‌‌ఆప్ష‌న్లు నమోదు చేసుకోవచ్చు. మరింత సమాచారానికి యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని యూనివర్సిటీ అధికారులు మంగళవారం (ఫిబ్రవరి 14) విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. 


యూనివర్సిటీ ఫీజుకింద బి-కేటిగిరి అభ్యర్థులు రూ.15,000; సి-కేటిగిరి అభ్యర్థులు రూ.20,000 చెల్లించాల్సి ఉంటుంది.ఆన్‌లైన్ విధానంలోనే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించాకే అలాట్ మెంట్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ఆప్షన్ల నమోదు సమయంలో ఏమైనా సందేహాలుంటే 9392685856, 7842542216, 9059672216 ఫోన్ నెంబర్లు లేదా ఈమెయిల్: tsayush2022@gmail.com ద్వారా సంప్రదించవచ్చు.



Also Read:


బిట్‌శాట్‌- 2023 నోటిఫికేషన్ విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!
రాజస్థాన్‌లోని పిలానీలో ఉన్న 'బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్(బిట్స్)'- బిట్‌శాట్ (బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్)-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రాంలలో ప్రవేశాలు కల్పించనున్నారు. హైదరాబాద్ క్యాంపస్, పిలానీ క్యాంపస్, కేకే బిర్లా గోవా క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పించనున్నారు. బీఈ, బీటెక్, బీఫార్మసీ, ఎంఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లు ఉంటాయి. ఎమ్మెస్సీ ప్రోగ్రాంలో ప్రవేశం పొందిన అభ్యర్థులు మొదటి సంవత్సరం తర్వాత ఇంజినీరింగ్ డ్యూయల్ డిగ్రీలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది మే 21 నుంచి 26 వరకు బిట్‌శాట్ ఆన్‌లైన్ టెస్ట్ సెషన్-1 పరీక్షలు, జూన్ 18 నుంచి 22 వరకు సెషన్-2  పరీక్షలు నిర్వహించనున్నారు.
ప్రవేశ ప్రకటన, కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మేనేజ్‌మెంట్ విద్యకు సరైన మార్గం ‘మ్యాట్’, ఫిబ్రవరి 2023 నోటిఫికేషన్ విడుదల!
ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేట్‌ (ఏఐఎంఏ)-2023 ఫిబ్రవరి సెషన్‌ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (MAT) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ, ఇతర ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏఐఎంఏ మ్యాట్‌ను ఏటా నాలుగుసార్లు (ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్) నిర్వహిస్తుంది. మ్యాట్ 2022 ఫిబ్రవరి నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. మ్యాట్ పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చూడవచ్చు.
దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి.. 


తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు, మే 7 నుంచి ఎంసెట్! ఇతర పరీక్షలు ఇలా!
తెలంగాణలో వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల షెడ్యూలు విడుదలైంది. ఎంసెట్‌, ఈసెట్‌, లాసెట్‌, పీజీసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీఈ సెట్‌కు సంబంధించిన కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టులకు సంబంధించిన పరీక్షల తేదీలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఫిబ్రవరి 7న ప్రకటించారు. 
ప్రవేశపరీక్షల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..