దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ముఖ్యంగా చిన్న పిల్లలను స్కూల్లో చేర్పించాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. ఈసారి అడ్మిషన్లు ప్రక్రియలో ఎటువంటి రాత పరీక్షలు లేదా ఇంటర్వ్యూలు ఉండవు. 

Continues below advertisement

అడ్మిషన్ల ప్రక్రియ ఎప్పుడు మొదలైంది

కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, బాల్‌వాటిక, ఒకటో తరగతి అడ్మిషన్ల కోసం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు మార్చి 20 ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. విద్యార్థుల ఎంపిక పర్తిగా పారదర్శకంగా లాటరీ పద్ధతిలలో జరుగుతుందని అధికారులు వెల్లడించారు. 

వయోపరిమితి నిబంధనలు ఇవే 

కొత్త జాతీయ విద్యా విధానం ప్రకారం, పిల్లల వయసును బట్టి ఏ తరగతికి అర్హులో నిర్ణయించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. బాల్‌వాటిక-1లో జాయిన్ అవ్వడానికి మూడేళ్లు నిండి నాలుగేళ్ల లోపు వారై ఉండాలి. బాల్‌వాటిక-2 నాలుగేళ్ల నిండి ఉండాలి. ఐదేళ్ల లోపు ఉండాలి. బాల్‌వాటిక -3లో జాయిన్ అవ్వాలంటే ఐదేళ్లు నిండి ఉండాలి, ఆరేళ్ల లోపు ఉండాలి. ఒకటో తరగతిలో జాయిన్‌ అవ్వాలంటే 6 ఏళ్ల నుంచి 8 ఏళ్ల లోపు ఉండాలి. 

Continues below advertisement

కావాల్సిన పత్రాలు 

దరఖాస్తు చేసుకునే సమయంలో తల్లిదండ్రులు పిల్లల పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్‌ సైజు ఫోటో, నివాస ధ్రువీకరణ పత్రం. కులానికి సంబంధించిన సర్టిఫికేట్‌, ఆర్థికంగా వెనుకబడిన వారైతే EWS లేదా BPL సర్టిఫికెట్‌, ప్రభుత్వ ఉద్యోగులైతే సర్వీస్ సర్టిఫికెట్ లేదా ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్‌ అవసరం అవుతాయి. 

దరఖాస్తు చేయడం ఎలా?

  • దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతోంది. మీరు సులభంగా అప్లై చేసుకోవడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వాలి. 
  • ముందుగా kvsangathan.nic.in లేదా kvs.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లాలి. 
  • హోమ్‌పేజీలో కనిపించే Balvatika & Class 1 Admission 2026-27 అనే లింక్‌ మీద క్లిక్ చేయండి. 
  • మీ మొబైల్‌ నంబర్, ఈ మెయిల్‌ ఐడీ ఇచ్చి రిజిస్టర్‌ చేసుకోండి. 
  • అప్లికేషన్ ఫారమ్‌లో అడిగిన వివరాలను తప్పులు లేకుండా పూర్తి చేయాలి. 
  • అవసరమైన డాక్యుమెంట్ల స్కాన్‌ చేసి అప్‌లోడ్ చేయండి. 
  • చివరగా ఫారమ్‌ను సబ్మిట్ చేసి, ఒక ప్రింట‌ అవుట్ తీసుకొని మీ వద్ద ఉంచుకోండి. 

లాటరీ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఎంపికైన విద్యార్థుల జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచుతారు. అప్పుడు తల్లిదండ్రులు ఒరిజినల్ డాక్యుమెంట్లను సమర్పించి అడ్మిషన్ ఫీజు చెల్లించి ప్రక్రియను పూర్తి చేయాలి.