జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల ప్రక్రియ పూర్తవడంతో.. సంబంధిత కళాశాలల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియను జోసా(జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ) జూన్ 19న ప్రారంభమైంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఆప్షన్ల ఎంపిక కోసం ప్రత్యేక లింక్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థులు జేఈఈ మెయిన్ అప్లికేషన్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు, సెక్యూరిటీ పిన్ వివరాలు నమోదుచేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రాంభించాల్సి ఉంటుంది. 


జోసా' కౌన్సెలింగ్‌లో భాగంగా.. జేఈఈ మెయిన్స్‌, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు జూన్ 19 నుంచి తమకు నచ్చిన విద్యాసంస్థలో సీటు కోసం ఆన్‌లైన్‌లో ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్ని ఆప్షన్లనైనా ఇచ్చుకునే వెసులుబాటు ఉంది. తదనంతరం విద్యార్థుల అవగాహన కోసం మాక్‌ సీటు అలకేషన్‌ను చేపట్టనున్నారు. ఇందులో భాగంగా జూన్ 25న మొదటి విడత, జూన్ 27న రెండో విడత మాక్ సీట్లను ప్రకటించనున్నారు. జూన్ 27తో ఆప్షన్ల నమోదు ప్రకియ ముగియనుంది. జూన్ 28 నుంచి అసలు ప్రక్రియ ప్రారంభంకానుంది. మొత్తం 6 రౌండ్లలో కౌన్సెలింగ్‌‌ కొనసాగనుంది. జూన్ 30న మొదటి విడత సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. 


 JoSAA 2023 Online Registration & Choice Filling


జోసా కౌన్సెలింగ్ షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


Website


JoSAA Counselling ఇలా..


♦ 1వ రౌండ్‌ : జూన్ 30 నుంచి జులై 5 వరకు


♦ 2వ రౌండ్‌: జులై 6 నుంచి జులై 11 వరకు


♦ 3వ రౌండ్‌: జులై 12 నుంచి జులై 15 వరకు


♦ 4వ రౌండ్‌: జులై 16 నుంచి జులై 20 వరకు


♦ 5వ రౌండ్‌: జులై 21 నుంచి జులై 25 వరకు


♦ 6వ రౌండ్‌ (చివరి): జులై 26 నుంచి  జులై 28 వరకు నిర్వహిస్తారు. 
 
6 రౌండ్ల సీట్ల కేటాయింపు తేదీలు ఇవే:


♦ 1వ రౌండ్‌ సీట్ల కేటాయింపు: జూన్ 30న


♦ 2వ రౌండ్‌: జులై 6న


♦ 3వ రౌండ్‌: జులై 12న


♦ 4వ రౌండ్‌: జులై 16న


♦ 5వ రౌండ్‌: జులై 21న


♦ 6వ రౌండ్‌ (చివరి): జులై 26న


జోసా 2023-కౌన్సెలింగ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ALSO READ:


భారీగా పెరిగిన 'జేఈఈ అడ్వాన్స్‌డ్‌' కటాఫ్‌ మార్కులు, వివరాలు ఇలా!
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో గత కొద్ది సంవత్సరాలుగా తగ్గుతూ వచ్చిన కటాఫ్ మార్కులు ఈసారి మాత్రం భారీగా పెరిగాయి. 2021లో 360 మార్కులకు కటాఫ్ 63 మార్కులుగా, 2022లో 360కి 55 మార్కులుగా ఉంది, అయితే ఈసారి కటాఫ్ మార్కులు ఏకంగా 86కు పెరగడం విశేషం. 2021, 22 సంవత్సరాల్లో కరోనా ప్రభావంతో విద్యార్థులు తగినంత ప్రతిభ చూపలేకపోయారని నిపుణులు చెబుతున్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి పరీక్ష కఠినంగా ఉందని భావించినప్పిటికీ.. అందుకు భిన్నంగా విద్యార్థలు మార్కులు సాధించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఏపీలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
ఏపీలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. ఏపీ ఉన్నత విద్యామండలి జూన్ 18న ఆన్‌లైన్ అడ్మిషన్స్ మాడ్యుల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (OAMDC) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ/ఎయిడెడ్/ప్రైవేటు అన్ఎయిడెడ్/అటానమస్ డిగ్రీ కాలేజీల్లో సాధారణ డిగ్రీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బి.వొకేషనల్, బీఎఫ్‌ఏ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్ కోర్సుల్లో చేరేందుకు జూన్ 19 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. 
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..