దేశవ్యాప్తంగా 650 జవహర్ నవోదయ విద్యాలయా(జేఎన్‌వీ)ల్లో 11వ తరగతిలో లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లావాసి అయి ఉండాలి. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థులు అక్టోబరు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
వివరాలు...
* జేఎన్‌వీల్లో 11వ తరగతి లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు
అర్హత: జేఎన్‌వీల్లో ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లావాసి అయి ఉండాలి. 2023-24 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయోపరిమితి: 01.06.2007 - 31.07.2009 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనేందుకు అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్‌లో అభ్యర్థి వివరాలను పేర్కొంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధ్రువీకరించిన సర్టిఫికెట్ సాఫ్ట్ కాపీని అప్‌లోడ్ చేయడం తప్పనిసరిని. దీంతో పాటు అభ్యర్థి ఫొటో, అభ్యర్థి, తల్లిదండ్రుల సంతకాలు, ఆధార్ వివరాలు, నివాస ధ్రువపత్రాల అవసరమవుతాయి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
ప్రవేశ పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో మొత్తం అయిదు విభాగాలు (మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లిష్, సైన్స్, సోషల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్) ఉంటాయి. పరీక్ష పేపర్ ఇంగ్లిష్, హిందీ భాషలో ఉంటుంది. పరీక్ష సమయం రెండున్నర గంటలు.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.10.2023.
➥ ప్రవేశ పరీక్షతేది: 10.02.2024.
అంబేడ్కర్ 'దూరవిద్య' డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు మరోసారి పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును అధికారులు మరోసారి పొడిగించారు. ఇప్పటికే పలుమార్లు పొడిగించిన ప్రవేశ గడువును పెంచిన యూనివర్సిటీ మరోసారి 15 రోజులపాటు పొడిగించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అభ్యర్థుల అభ్యర్థన మేరకు ప్రవేశ దరఖాస్తు గడువును సెప్టెంబరు 30 వరకు పొడిగించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సు, సీట్ల వివరాలు ఇలా!
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ) 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ డిజైన్(బీడిజైన్) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, అహ్మదాబాద్, హరియాణా, మధ్యప్రదేశ్, అసోంలో ఉన్న ఎన్‌ఐడీ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 1లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో మాస్టర్ డిగ్రీ కోర్సు, వివరాలు ఇలా
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ) 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల మాస్టర్ ఆఫ్ డిజైన్(బీడిజైన్) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అహ్మదాబాద్, బెంగళూరు, గాంధీనగర్‌లో ఉన్న ఎన్‌ఐడీ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 1లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..