హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూహెచ్)-పార్ట్ టైమ్ పీజీ కోర్సుల్లో దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. సెప్టెంబరు 27తో ముగిసిన గడువును అక్టోబరు 9 వరకు పొడిగించారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.3000 చెల్లించాల్సి ఉంటుంది. ఎంటెక్, ఎంబీఏ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ప్రోగ్రామ్ వ్యవధి మూడేళ్లు. ఆరు సెమిస్టర్లు ఉంటాయి. వీటిని ఉద్యోగులకు ప్రత్యేకించారు. అభ్యర్థులు హైదరాబాద్ పరిధిలో కనీసం ఏడాదిపాటు ఉద్యోగం చేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలి. దరఖాస్తుతోపాటు ఒరిజినల్ సర్వీస్ సర్టిఫికెట్ అవసరమవుతాయి. ప్రవేశపరీక్ష ద్వారా సీట్లను భర్తీ చేస్తారు. అయితే ఈ ప్రోగ్రామ్‌లకు ఎలాంటి స్కాలర్‌షిప్ లభించదు.
వివరాలు..
1) ఎంటెక్ ప్రోగ్రామ్
స్పెషలైజేషన్లు: ఎలక్ట్రికల్ పవర్ ఇంజనీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్ & ఇండస్ట్రియల్ డ్రైవ్స్, ఇంజినీరింగ్ డిజైన్, థర్మల్ ఇంజనీరింగ్, అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్ సిస్టమ్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్, ఇండస్ట్రియల్ మెటలర్జీ, బయోటెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్, వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్, రిమోట్ సెన్సింగ్ అండ్ జీఐఎస్ స్పెషలైజేషన్‌లు ఉన్నాయి. స్పెషలైజేషన్‌కు 30 సీట్లు ప్రత్యేకించారు.
సీట్ల సంఖ్య: ఒక్కో స్పెషలైజేషన్‌లో 30 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
అర్హత:
* ఎంటెక్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి స్పెషలైజేషన్‌కు నిర్దేశించిన విభాగాల్లో బీఈ/బీటెక్/ఏఎంఐఈ ఉత్తీర్ణులై ఉండాలి.
* కంప్యూటర్ సైన్స్‌కు ఎంసీఏ ఉత్తీర్ణత ఉండాలి.
* బయోటెక్నాలజీకి ఎమ్మెస్సీ (ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్/ కెమిస్ట్రీ/ బయోకెమిస్ట్రీ/ మైక్రోబయాలజీ/ లైఫ్‌సైన్సెస్/ బయోటెక్నాలజీ)/ బీవీఎస్సీ/ ఎంబీబీఎస్/ బీడీఎస్/బీఫార్మసీ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
* ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్‌కు ఏదేని డిగ్రీ(ఇంజనీరింగ్/ టెక్నాలజీ/ ఆర్కిటెక్చర్/ ప్లానింగ్/ అగ్రికల్చర్), పీజీ(సైన్సె్‌స్/కంప్యూటర్ అప్లికేషన్స్/ఐటీ)/ఎంసీఏ పూర్తిచేసి ఉండాలి.
* వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్‌కు ఎమ్మెస్సీ (జియోఫిజిక్స్/ జియాలజీ/ హైడ్రాలజీ/ రిమోట్ సెన్సింగ్/ ఎన్విరాన్‌మెంటల్ సైన్సె్‌స్/ అగ్రికల్చర్/ జియోస్పేషియల్/ ఎర్త్ సైన్సె్‌స్/అట్మాస్పిరిక్ సైన్సెస్ /వాటర్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్) పూర్తిచేసినవారు కూడా దరఖాస్తుకు అర్హులు.
* రిమోట్ సెన్సింగ్ అండ్ జీఐఎస్‌కి ఎమ్మెస్సీ (జియోఇన్ఫర్మాటిక్స్/ జియోమాటిక్స్/మ్యాథమెటిక్స్ /ఫిజిక్స్/ జాగ్రఫీ/ అగ్రికల్చర్/వాటర్ రిసోర్సెస్/వాటర్ & ఎన్విరాన్‌మెంటల్ సైన్సె్స్/జియోస్పేషియల్ సైన్స్ & టెక్నాలజీ/ ఎర్త్ రిసోర్సె్‌స్/ఓషన్ సైన్సె్‌స్)/ ఎంసీఏ/ఎంబీఏ పూర్తిచేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
2) ఎంబీఏ ప్రోగ్రామ్
స్పెషలైజేషన్లు: హెచ్‌ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్, ఆంత్రప్రెన్యూర్‌షిప్ స్పెషలైజేషన్‌లు ఉన్నాయి.
సీట్ల సంఖ్య: ఒక్కో స్పెషలైజేషన్‌లో 30 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
అర్హత: ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ఏదేని మూడేళ్ల డిగ్రీ పాసైతే చాలు.
ప్రవేశ పరీక్ష వివరాలు: ప్రవేశ పరీక్షలో మొత్తం 60 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం గంట. ఎంటెక్‌లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలో సంబంధిత స్పెషలైజేషన్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఎంబీఏ అభ్యర్థులకు అనలిటికల్/రీజనింగ్ ఎబిలిటీ, మేథమెటికల్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఎబిలిటీ అంశాలనుంచి ప్రశ్నలు అడుగుతారు. ఎంట్రెన్స్ టెస్ట్ సిలబస్ కోసం వెబ్‌సైట్ చూడవచ్చు. టెస్ట్ తేదీలను త్వరలో ప్రకటిస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.3,000.
ట్యూషన్ ఫీజు: సెమిస్టర్‌కు రూ.25,000
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 9
దరఖాస్తుతోపాటు అప్‌లోడ్ చేయాల్సిన పత్రాలు: పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ మార్కుల పత్రాలు; టీసీ; అనుభవం సంబంధిత పత్రాలు; నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్; సర్వీస్ సర్టిఫికెట్; మెడికల్ సర్టిఫికెట్(దివ్యాంగులకు మాత్రమే)
పరీక్ష కేంద్రం: జేఎన్‌టీయూహెచ్ క్యాంపస్, కూకట్‌పల్లి, హైదరాబాద్.
Notification & Online Application