TS EAPCET 2024 Rank Cards: తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన TSEAPCET -2024 పరీక్ష ఫలితాలు మే 18న విడుదలైన సంగతి తెలిసిందే. ఫలితాలతోపాటు ర్యాంకు కార్డులను కూడా అందుబాటులో ఉంచారు. అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ ఎప్‌సెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, ఎప్‌సెట్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ర్యాంకుకార్డులు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూలును అధికారులు వారంరోజుల్లో విడుదల చేయనున్నారు.


ఎప్‌సెట్ ర్యాంకు కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..


➥ టీఎప్ ఎప్‌సెట్ ర్యాంకు కార్డుల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట‌్‌లోకి వెళ్లాలి- https://eapcet.tsche.ac.in/


➥ అక్కడ హోంపేజీలోని కిందిభాగంలో కనిపించే ర్యాంకు కార్డులకు సంబంధించి లింక్ 'Download Rank Card (E, A&P)' మీద క్లిక్ చేయాలి.


➥ ఆ తర్వాత వచ్చే పేజీలో అభ్యర్థులు తమ ఎప్‌సెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, ఎప్‌సెట్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేయాలి.


➥ వివరాలు నమోదుచేశాక ''View Rank Card'' బటన్ మీద క్లిక్ చేయాలి.


➥ అభ్యర్థులకు సంబంధించిన ర్యాంకు కార్డులు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.


➥ ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకొని భవిష్యత్ అవసరాల కోసం దాచుకోవాలి.


TS EAPCET - 2024 ర్యాంకు కార్డుల కోసం క్లిక్ చేయండి...


TS EAPCET 2024 ఫలితాల కోసం క్లిక్ చేయండి..


TS EAPCET 2024 Toppers: టీఎస్ ఎప్‌సెట్ -2024 ఫ‌లితాలు మే 18న విడుదలైన సంగతి తెలిసిందే. విద్యాశాఖ ముఖ్య కార్యద‌ర్శి బుర్రా వెంక‌టేశం, ఉన్నత విద్యామండ‌లి చైర్మన్ ఆర్ లింబాద్రి ఫలితాలను విడుద‌ల చేశారు. ఎప్‌సెట్ ఫలితాల్లో బాలుర కంటే బాలికలే ఎక్కువగా క్వాలిఫై అయ్యారు. అయితే టాప్-10లో ఒకే అమ్మాయి 10 ర్యాంకులో నిలిచింది. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 89.66 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు 90.18 శాతం, బాలురు 88.25 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక ఇంజినీరింగ్ విభాగంలో 74.98 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు 75.85 శాతం, బాలురు 74.98 శాతం ఉత్తీర్ణత సాధించారు. అగ్రిక‌ల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ ప‌రీక్షల‌కు 91,633 మంది విద్యార్థులు హాజ‌రు కాగా.. 82,163 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇక ఇంజినీరింగ్ విభాగంలో 2,40,618 మంది విద్యార్థులు హాజ‌రు కాగా.. 1,80,424 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఇంజినీరింగ్, అగ్రి రెండు స్ట్రీమ్ లలోనూ ఏపీ విద్యార్థులదే మొదటి ర్యాంకు సాధించారు. ఇక ఎంసెట్‌ ఫలితాల్లో మొదటి రెండు ర్యాంకులు ఏపీ విద్యార్థులకే రావడం విశేషం.


TS EAPCET - 2024 టాపర్ల వివరాలు కోసం క్లిక్ చేయండి..


హైదరాబాద్‌లో టాప్ 10 ఇంజినీరింగ్ కాలేజీలు ఇవే..
ఇంటర్మీడియెట్ అయిపోయిన విద్యార్థులు ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరటానికి సిద్ధమవుతున్నారు. ఏ కాలేజీలో చేరితే బెస్ట్ అనే డైలమా పేరెంట్స్ లోనూ, విద్యార్థుల్లోనూ కనిపిస్తుంది. అయితే, హైదరాబాద్ లో టాప్ 10 బెస్ట్ ఇంజినీరింగ్ కాలేజీల గురించి తెలుసుకుంటే ఎంచుకోవటానికి అనువుగా ఉంటుంది.  ఫ్యాకల్టీ, వసతులు, క్యాంపస్ బట్టి అన్ని రాష్ట్రాల విద్యార్థులను ఆకర్షిస్తున్న హైదరాబాద్ లోని టాప్ 10 ఇంజినీరింగ్ కాలేజీల వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..