JEE Main తొలి విడత రిజల్ట్స్ విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) విడుదల చేసింది. విద్యార్థులను తమ స్కోర్ కార్డును jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని, అక్కడి నుంచే కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని జాతీయ పరీక్షల మండలి ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, తెలంగాణకు చెందిన చెందిన యశ్వంత్‌, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పీ. ఆదినారాయణ, కే.సుహాస్‌, కే.ధీరజ్‌, అనికేత్‌ చటోపాధ్యాయ, రూపేశ్‌ అనే వారు వంద పర్సంటైల్‌ సాధించారు.


JEE Main Exams జూన్‌ 23 నుంచి 29 వరకు జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) నిర్వహించింది. ఈ నెల 6న ఫైనల్‌ కీని విడుదల చేసింది. తాజాగా ఆ రిజల్ట్స్‌ను అధికారిక వెబ్‌సైట్‌ jeemain.nta.nic.in, nta.ac.in, ntaresults.nic.in లో అందుబాటులో ఉంచింది. అయితే ప్రస్తుతానికి జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 (బీఈ, బీటెక్‌) సంబంధించిన రిజల్ట్స్‌ను మాత్రమే విడుదల చేసింది. పేపర్‌-2 (బీఆర్క్‌, బీ ప్లానింగ్‌) రిజల్ట్స్ ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఈ ఏడాది రాష్ట్రం నుంచి 50 వేలకుపైగా స్టూడెంట్స్ తొలి విడత పరీక్షలకు హాజరయ్యారు.