Telnagana Inter Classes: తెలంగాణలోని జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులు మే 31తో ముగియనున్నాయి. వేసవి సెలవుల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్నిరకాల జూనియర్ కాలేజీలకు మార్చి 31 నుంచి సెలువులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సమ్మర్ హాలీడేస్ మే 31తో ముగుస్తున్నాయి. దీంతో ఇంటర్‌లో కొత్తగా చేరిన ప్రథమ సంవత్సరం విద్యార్థులతోపాటు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. రాష్ట్రంలో ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ మే 9న ప్రారంభమైన సంగతి తెలిసిందే. మే 31 వరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్ 30 నాటికి మొదటి దశ ప్రవేశ ప్రక్రియ పూర్తిచేయనున్నారు. మొదటి దశ ప్రవేశాలు పూర్తికాగానే.. రెండోదశ ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుంది.


ఇప్పటికే 2024-2025 విద్యాసంవత్సరానికి సంబంధించిన విద్యాక్యాలెండర్‌ను ఇంటర్ బోర్డు మార్చి 30న వెల్లడించిన విషయం విదితమే. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ కళాశాలలకు ఈ క్యాలెండర్ వర్తించనుంది. 


➥ ఇంటర్ బోర్డు ప్రకటించిన ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. 2024-2025 విద్యాసంవత్సరానికిగాను జూన్ 1 నుంచి విద్యార్థులకు తరగతులు ప్రారంభంకానున్నాయి. మార్చి 30తో విద్యాసంవత్సరం ముగియనుంది. విద్యార్థులకు మార్చి 30 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి. 


➥ అక్టోబర్‌ 6 నుంచి 13 వరకు దసరా సెలవులు, నవంబర్‌ 18 నుంచి 23 వరకు అర్ధ సంవత్సర పరీక్షలు, వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనునున్నాయి.


➥ ఇంటర్ విద్యార్థులకు జనవరి 20 నుంచి 25 వరకు ప్రీ ఫైనల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ప్రాక్టికల్స్‌ పరీక్షలను ఫిబ్రవరి మొదటివారంలో  నిర్వహించనున్నారు. మార్చి మొదటి వారం ఇంటర్ థియరీ పరీక్షలు నిర్వహించనున్నారు. 


తెలంగాణ ఇంటర్ అకడమిక్​ ఇయర్ (​2024-25) క్యాలెండర్ ​..


➥ జూనియర్ కళాశాలల పునఃప్రారంభం: 01.06.2024. 


➥ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభం: 01.06.2024.


➥ కళాశాలలకు దసరా సెలవులు: 06.10.2024 - 13.10.2024.


➥ దసరా సెలవుల తర్వాత పునఃప్రారంభం: 14.10.2023.


➥ అర్ధ సంవత్సర పరీక్షలు: 18.11.2024 - 23.11.2024.


➥ కళాశాలలకు సంక్రాంతి సెలవులు: 11.01.2025 - 16.01.2025.


➥ సంక్రాంతి సెలవుల తర్వాత పునఃప్రారంభం: 17.01.2025.


➥ ప్రీ-ఫైనల్ పరీక్షలు: 20.01.2025 - 25.01.2025.


➥ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు: 2025 ఫిబ్రవరి రెండవ వారం నుండి.


➥  ఇంటర్ థియరీ పరీక్షలు: 2025 మార్చి మొదటి వారం నుండి.


➥ కళాశాలలకు వేసవి సెలవులు: 30.03.2025 - 31.05.2025.


➥ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు: 2025 మే చివరి వారంలో


➥ 2025-26 విద్యా సంవత్సరానికి జూనియర్ కళాశాలల పునఃప్రారంభ తేదీ: 01.06.2025.



ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల..
తెలంగాణలోని కళాశాలల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ నోటిఫికేషన్ మే 29న వెలువడిన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మొత్తం మూడు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 


➥ఎప్‌సెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు జూన్ 27 నుంచి జులై 12 వరకు మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అభ్యర్థులు జూన్ 30 నుంచి వెబ్‌ ఆప్షన్లు నమోదుచేసుకోవాలి. ఇక ఆప్షన్లను నమోదుచేసుకున్నవారికి జులై 12న సీట్లను చేటాయిస్తారు. 


➥ రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియను జులై 19 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. ఈ దశలో జులై 19 నుంచి వెబ్ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. అనంతరం జులై 24న రెండో విడత సీట్లను కేటాయిస్తారు. 


➥ మిగిలిపోయిన ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి జులై 30 నుంచి ఆగస్టు 5 వరకు చివరి విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలను ఆగస్టు 17న విడుదల చేయనున్నారు.   


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..