Indian Navy Quiz 2022 : భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో భాగంగా, ఇండియన్ నేవీ 9 నుంచి 12 వ తరగతి వరకు చదువుతున్న పాఠశాల విద్యార్థుల కోసం ‘The Indian Navy Quiz 2022 -ThinQ-22’ పేరుతో జాతీయ స్థాయి క్విజ్‌ ఫోటీని నిర్వహిస్తోంది. ఆసక్తిగల పాఠశాలలు www.theindiannavyquiz.orgలో నమోదు చేసుకోవచ్చని నేవీ అధికారులు సూచించారు. క్విజ్ ప్రిలిమ్స్ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఫైనల్స్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ INS విక్రమాదిత్య, ఇండియన్ నేవల్ అకాడమీలో నిర్వహిస్తారు. ఈ క్విజ్ ద్వారా విద్యార్థులకు భారత నావికాదళం 'జీవన విధానాన్ని' తెలియజేయడం, విద్యార్థులకు నేవీకి సంబంధించిన నాలెడ్జ్ పెంపొందించడం ముఖ్య ఉద్దేశం అని అధికారులు తెలిపారు.  దేశభక్తి భావాన్ని పెంపొందించడానికి ఈ ప్రత్యేకమైన అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. 



టాప్ 16 జట్లకు


విద్యార్థులకు ఎంతో ఆసక్తికరంగా ఉండేలా క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నేవీ అధికారులు తెలిపారు. ప్రతీ టీమ్ లో ఇద్దరు విద్యార్థులు, ఒక గైడ్/ఒక టీచర్ ఉంటారు. ఈ పోటీల్లో టాప్ లో నిలిచిన 16 టీమ్ లకు జీవితంలో మరిచిపోలేని అనుభూతిగా నిలిచిపోతుందని నిర్వాహకులు అంటున్నారు. ఈ జట్లు అన్ని స్పాన్సర్ట్ ట్రిప్  లతో పాటు సెమీ ఫైనల్స్, గ్రాండ్ ఫినాలేలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ లక్కీ టీమ్‌లు భవిష్యత్ నావికాదళ నిర్వహించే కార్యక్రమాలు వీక్షించవచ్చు. నౌకాదళం పాసింగ్ అవుట్ పరేడ్ ను చూసేందుకు, అద్భుతమైన విమాన వాహక నౌక INS విక్రమాదిత్యను సందర్శించేందుకు అవకాశం కల్పిస్తారు. 



7500 పాఠశాలలు 


సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఇండియన్ నేవీ క్విజ్ (THINQ-22) గురించి నోటీసు జారీ చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 7500 పాఠశాలలకు ఈ పోటీల్లో పాల్గొనాలని ఆహ్వానాలు పంపామని సీబీఎస్ఈ తెలిపింది. విద్యార్థులుఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొనేందుకు టీచర్లు ప్రచారం చేయాలని CBSE కోరింది. జాతీయ స్థాయి క్విజ్ కోసం నమోదు ఇప్పటికే ప్రారంభమైంది. ప్రైమరీ రౌండ్లు ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 22 మధ్య జరుగుతాయి. నవంబర్‌లో సెమీ ఫైనల్, ఫైనల్స్ ఇండియన్ నేవల్ బేస్‌లలో జరుగుతాయి. జులై 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం అయింది. 


ఆకర్షణీయమైన బహుమతులు 


ఒక ప్రొఫెషనల్ క్విజ్ మాస్టర్ టీమ్ ఈవెంట్‌ను పర్యవేక్షిస్తుంది. సెమీ ఫైనల్‌కు 16 క్వాలిఫైయింగ్ జట్లను నిర్ణయించడానికి మూడు ఆన్‌లైన్, రెండు ఆఫ్‌లైన్ రౌండ్‌లు నిర్వహిస్తారు. చివరి రౌండ్‌లో ఎనిమిది జట్లు పాల్గొంటాయి. సెమీ-ఫైనల్‌లు, ఫైనల్‌లు నౌకాదళ బేస్ లలో నిర్వహిస్తారు. ఈ పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు ప్రత్యేకమైన అనుభవంతో పాటు, వివిధ స్థాయిలలో చాలా ఆకర్షణీయమైన బహుమతులను గెలుచుకోవచ్చు.