IIT Hyderabad PG Admissions:  సంగారెడ్డి జిల్లా కందిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్(ఐఐటీహెచ్‌)- జులై 2024 సెషన్‌కు సంబంధించి వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఎంటెక్‌, ఎంఏ, ఎండిజైన్‌, ఎంఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, వ్యాలిడ్‌ సీడ్‌/ గేట్‌/ జామ్‌ తదితర జాతీయ స్థాయి పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.300 చెల్లిస్తే సరిపోతుంది. అభ్యర్థులు ఏప్రిల్ 11లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.


ప్రోగ్రామ్ వివరాలు..


* పీజీ ప్రవేశాలు జులై 2024 ప్రోగ్రామ్


➥ ఎంటెక్‌ (మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ)


విభాగాలు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోమెడికల్ ఇంజినీరింగ్, మెడికల్ సెన్సింగ్-అనలిటిక్స్ & సిమ్యూలేషన్, నానోమెడిసిన్ & బయోమెటీరియల్స్, మెడికల్ బయోటెక్నాలజీ, క్లైమేట్ చేంజ్, సివిల్ ఇంజినీరింగ్(స్ట్రక్చరల్, ఎన్విరాన్‌మెంటల్, హైడ్రాలిక్ & వాటర్ రిసోర్స్, జియో టెక్నికల్, ట్రాన్స్‌పొర్టేషన్), కెమికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెడికల్ డివైస్ ఇన్నోవేషన్, డిజైన్ (విజువల్, ప్రొడక్ట్, ఇంటరాక్షన్, డిజైన్ స్టడీస్), ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ & మేనేజ్‌మెంట్, మెటీరియల్స్ సైన్స్ & మెటలర్జికల్ ఇంజినీరింగ్, మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్, సెంటర్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్, ఫిజిక్స్.


➥ ఎండిజైన్‌ (మాస్టర్ ఆఫ్ డిజైన్)


➥ ఎంఏ (మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్)


విభాగాలు: డెవలప్‌మెంటల్ స్టడీస్, హెల్త్-జెండర్ & సొసైటీ.


➥ ఎంఎస్సీ (మాస్టర్ ఆఫ్ సైన్స్) 


విభాగాలు: కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.


అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, వ్యాలిడ్‌ సీడ్‌/ గేట్‌/ జామ్‌ తదితర జాతీయ స్థాయి పరీక్షల్లో స్కోరు సాధించి ఉండాలి.


దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.300 చెల్లిస్తే సరిపోతుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా


ఎంపిక విధానం: విభాగాన్ని అనుసరించి విద్యార్హతలు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.


ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 11.04.2024.


Courses Details & Application


Website


ALSO READ:


'నెట్‌' స్కోర్‌తో పీహెచ్‌డీ ప్రవేశాలు, యూజీసీ ఛైర్మన్ వెల్లడి
దేశంలోని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. పీహెచ్‌డీ ప్రవేశపరీక్షల స్థానంలో నెట్ స్కోరును తీసుకోవాలని పేర్కొంది. పీహెచ్‌డీ ప్రవేశాలకు జాతీయ ప్రవేశ పరీక్షతోపాటు నెట్ నిబంధనలను సమీక్షించడానికి యూజీసీ నిపుణుల కమిటీని ఏర్పాటుచేసింది. 2024-25 నుంచి నెట్‌ స్కోరుతో ప్రవేశాలు కల్పించాలని వెల్లడించింది. జేఆర్‌ఎఫ్‌తో పీహెచ్‌డీ ప్రవేశం, సహాయ ఆచార్యుల నియామకం, పీహెచ్‌డీ ప్రవేశాలకు నెట్ అభ్యర్థులను మూడు కేటగిరీల్లో అర్హులుగా ప్రకటిస్తామని వెల్లడించింది. ఇందులో 2, 3 కేటగిరీ అభ్యర్థులకు పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నెట్ స్కోరుకు 70 శాతం, ఇంటర్వ్యూకు 30 శాతం వెయిటేజీ ఉంటుంది. అభ్యర్థులు పొందిన NET మార్కులు Ph.D కోసం ఒక సంవత్సరం పాటు చెల్లుబాటులో ఉంటాయి. ఈ మేరకు యూజీసీ ఛైర్మన్ మామిడాల జగదీశ్ 'ఎక్స్‌'లో ట్వీట్ చేశారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..