Andhra Inter Exams: ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్‌కు హాజరవుతున్నారా ? - ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి

Inter exams: ఏపీలో ఇంటర్ పరీక్షలు రాసే వారికి కీలక సూచనలను ఇంటర్మీడియట్ విద్యాసాఖ ఇచ్చింది. ఒకటో తేదీ నుంచి ఇరవయ్యో తేదీ వరకూ పరీక్షలు జరగనున్నాయి.

Continues below advertisement

Important tips for AP Inter exams:  మార్చి 1వ తేదీ నుండి 20వ తేదీ వరకూ ఇంటర్మీడియెట్ పరీక్షలు జరగన్నాయి.మార్చి 1నుండి 19 వరకూ ప్రధమ సంవత్సర పరీక్షలు,3 నుండి 20 వరకూ ద్వితీయ సంవత్సర పరీక్షలు రోజూ ఉదయం 9గం.ల నుండి మధ్యాహ్నం 12 గం.ల వరకూ జరగనుండగా 26 జిల్లాల్లో 1535 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 10 లక్షల 58వేల 892 మంది విద్యార్ధులు పరీక్షలు  రాస్తారు. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటికి సంబంధించిన ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 3 నుండి 15వ తేదీ వరకూ జరగనుండగా 325 కేంద్రాల్లో ఈపరీక్షలకు మొత్తం 67వేల 952 మంది విద్యార్ధులు పరీక్షలు రాస్తారు. 

Continues below advertisement

సీఎస్ విజయానంద్ సమీక్ష 

మార్చి-ఏప్రిల్ నెలలు పరీక్షల మాసాలని కావున ఆయా పరీక్షలు సజావుగా సాగేందుకు తగిన విస్తృత ఏర్పాట్లు చేయాలని కలక్టర్లు,ఎస్పిలను విజయానంద్ ఆదేశించారు.ఈపరీక్షలకు సంబంధించి 1535 కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటిలో 68 కేంద్రాలను సెన్సిటివ్,36 కేంద్రాలు వల్నరబుల్ కేంద్రాలుగా గుర్తించడం జరిగిందని అక్కడ గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు.  వేసవి దృష్ట్యా ఆయా పరీక్షా కేంద్రాల్లో తాగునీరు,ప్రధమ చికిత్స ఏర్పాట్లు,విద్యుత్,బెంచ్ లు వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ విజయానంద్ కలక్టర్లకు స్పష్టం చేశారు.పరీక్షల సమయంలో పేపరు లీకేజి వంటి వదంతలు తప్పుడు వార్తలు ప్రసారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు వీలుగా పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ణలు జారీ చేయాలని ఆదేశించారు.పరీక్షా కేంద్రాల పరిధిలో పరీక్షల సమయంలో జిరాక్సు కేంద్రాలు,నెట్ కేంద్రాలు మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు.

విద్యార్థులు సకారంలో చేరుకునేలా ఏర్పాట్లు 

పరీక్షలు జరిగే రోజుల్లో ఆయా పరీక్షా కేంద్రాలకు విద్యార్ధులు సకాలంలో చేరుకునే విధంగా ఆర్టీసీ తగిన బస్సులను నడిపేలా అధికారులు చర్యలు  తీసుకుంటారు. పరీక్షల నిర్వహణలో ఫిర్యాదుల స్వీకరణకు రాష్ట్ర స్థాయిలో టోల్ ఫ్రీ నంబరు 1800 425 1531 కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు.  అదే విధంగా జిల్లా కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేస్తారు.  పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు,ఇతర ఎలక్ట్రానికి వస్తువులేవీ అనుతించ రు.  తాగునీరు అందుబాటులో ఉంచడం తోపాటు తగిన వెలుతురు ఉండాలని,విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని  అధికారులకు స్పష్టమైన సూచనలు పంపారు.  అన్ని పరీక్షా కేంద్రాలను సిసిటివి కవరేజ్ తో అనుసంధానించి చీఫ్ సూపరింటిండెంట్ ఆ సిసి కమెరాలను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పర్యవేక్షిస్తారు. 

పరీక్షా కేంద్రాల్లో ప్రథమ చికిత్సా సౌకర్యం 

పరీక్షా కేంద్రాల్లో ప్రధమ చికిత్స సౌకర్యాన్ని అందుబాటులో ఉంచడం తోపాటు అత్యవసర సమయాల్లో చికిత్సకై 108 అంబులెన్సును కూడా అందుబాటులో ఉంచేలా  అధికారులు జాగ్రత్తలుతీసుకుంటారు. ప్రశ్నాపత్రాలను పోలీస్ స్టేషన్ సేఫ్ కస్టడీ ఉంచి ఆయా పరీక్షా కేంద్రాలకు తీసుకువెళ్ళాలని పరీక్ష అనంతరం జవాబు పత్రాలను సీల్ చేసి  చీఫ్ సూపరింటిండెంట్,డిపార్టుమెంటల్ అధికారి ఆయా జవాబు పత్రాల బండిళ్ళను స్పీడు పోస్టు ద్వారా పంపాలని అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.  

 

Continues below advertisement