న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)‌ 2023-24 విద్యా సంవత్సరానికి పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాం(ఫస్ట్ సెమిస్టర్)లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కోర్సును అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


కోర్సుల వివరాలు:


⦁ పీహెచ్‌డీ


⦁ ఎంటెక్


⦁ ఎంఎస్ (రిసెర్చ్)


⦁ ఎం.డిజైన్


⦁ ఎంపీపీ


⦁ ఎంఎస్సీ(హ్యుమానిటీస్ & సోషల్ సైన్సెస్)


అర్హత: పీజీ ప్రోగ్రాంలో ప్రవేశానికి సంబంధిత విభాగంలో మొదటి శ్రేణిలో బ్యాచిలర్ డిగ్రీ; పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రవేశాలకు సంబంధిత విభాగంలో మొదటి శ్రేణిలో పీజీ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ఇంజినీరింగ్ విభాగాలకు గేట్, డిజైన్ విభాగాలకు సీడ్ వ్యాలిడ్ స్కోరు సాధించి ఉండాలి. ఎంఎస్సీ కాగ్నిటివ్‌ సైన్స్‌ ప్రోగ్రాంనకు గేట్‌/ జామ్‌, జేఆర్‌ఎఫ్‌, నెట్‌ వ్యాలిడ్‌ స్కోరు సాధించి ఉండాలి


దరఖాస్తు ఫీజు: రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.50 చెల్లించాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేయాలి.


ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా సీటు కేటాయస్తారు.


ముఖ్యమైన తేదీలు..


🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 14.03.2023


🔰 ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 30.03.2023.


🔰 పరీక్ష/ ఇంటర్వ్యూ తేదీలు: 16.05.2023 & 16.06.2023.


🔰 తరగతులు ప్రారంభం: 24.07.2023.



Notification 

Website 


Also Read:


బెంగళూరు ఐఐఎస్సీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(రిసెర్చ్‌) ప్రోగ్రాంలో ప్రవేశాలు, వివరాలు ఇలా!
బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) 2023-24 విద్యా సంవత్సరానికి బీఎస్సీ రిసెర్చ్ ప్రోగ్రాం కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కోర్సు వ్యవధి నాలుగేళ్లు. ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి. ప్రవేశాలు పొందిన అభ్యర్థులకు కేవీపీవై/ ఇన్‌స్పైర్‌/ ఐఐఎస్సీ ఉపకార వేతనం అందుతుంది. ఇంటర్ అర్హత ఉన్నవారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
దేశంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో సైన్స్ విభాగంలో లెక్చరర్‌షిప్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్ (జేఆర్‌ఎఫ్) అర్హత కోసం  'సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్' పరీక్ష నిర్వహిస్తున్న సంగతి విదితమే. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్), నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సంయుక్తంగా ఏడాదికి రెండుసార్లు (జూన్, డిసెంబరు) ఈ అర్హత పరీక్షను నిర్వహిస్తాయి. ఈ ఏడాదికి గాను 'సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్- డిసెంబరు 202/ జూన్ 2023' నోటిఫికేషన్ వెలువడింది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 10న ప్రారంభమైంది. అభ్యర్థులు ఏప్రిల్ 10 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తులు సమర్పించవచ్చు.
సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి.. 


ఇంటర్‌ అర్హతతో ఎంబీఏ, ప్రవేశ ప్రకటన విడుదల చేసిన ఇండోర్ ఐఐఎం
ఇండోర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఐదేళ్ల 'ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్‌మెంట్(ఐపీఎం)' కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ అర్హత ఉన్నవారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సులో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి. మొదటి మూడేళ్లు ఫౌండేషన్, తర్వాత రెండేళ్లు మేనేజ్‌మెంట్ విద్యపై దృష్టి సారిస్తారు. తొలి భాగంలో భాష, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు; మేనేజ్‌మెంట్ విద్య ప్రాథమికాంశాలు, నైతిక విలువలు అర్థం చేసుకునే నైపుణ్యం, శారీరక ఆరోగ్యంపై దృష్టి సారిస్తారు. చివరి రెండేళ్లు లక్ష్యం దిశగా బోధన ఉంటుంది.
కోర్సు, పరీక్ష తేదీ వివరాల కోసం క్లిక్ చేయండి. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..