దేశంలోని ఉన్నతవిద్య సంస్థల్లో బయో టెక్నాలజీ, ఇతర సైన్స్ విభాగాల్లో మాస్టర్స్‌ డిగ్రీ చేయాలనుకునే వారికోసం ఉద్దేశించిన ‘జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ మాస్టర్స్‌ (జామ్‌) 2023’ పరీక్షకు సంబంధించిన రెస్పాన్స్ షీట్లను ఐఐటీ గువహటీ ఫిబ్రవరి 20న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో రెస్పాన్స్ షీట్లను అందుబాటులో ఉంచారు. జామ్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి రెస్పాన్స్ షీట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 


రెస్పాన్స్ షీట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..


స్టెప్ 1: అధికారిక వెబ్‌సైట్‌ సందర్శించాలి. - https://jam.iitg.ac.in/


స్టెప్ 2: హోంపేజీలో కనిపించే  'Candidate Portal' బటన్‌పై క్లిక్ చేయాలి.


స్టెప్ 3: అక్కడ లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేయాలి. 


స్టెప్ 4: అభ్యర్థులు రెస్పాన్స్ షీట్ కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. 


స్టెప్ 5: రెస్పాన్స్ షీట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి. 


రెస్పాన్స్ షీట్ల కోసం క్లిక్ చేయండి.. 


ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 22న ఐఐటీ జామ్ 2023 ఫలితాలను వెల్లడించనున్నారు. ఫలితాల వెల్లడి తర్వాత ఏప్రిల్ 11 నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభంకానుంది. ఐఐటీ గువాహటి ఏడాది ఫిబ్రవరి 12న జామ్-2023 ప్రవేశ పరీక్ష నిర్వహించింది. మొత్తం 7 సబ్జెక్టులలో (బయోటెక్నాలజీ, ఎకనామిక్స్, కెమిస్ట్రీ, జియోలజీ, మ్యాథమెటిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్) పరీక్ష నిర్వహించింది.


దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు అందిస్తున్న వివిధ పీజీ ప్రోగ్రామ్‌లలో సుమారు 3000 సీట్లను జామ్‌ స్కోర్‌ ద్వారా భర్తీ చేస్తారు. వీటితోపాటు నిట్‌లు(NIT), ఐసర్లు(IISER), ఐఐఎస్సీ(IISC), ఐఐఈఎస్‌టీ(IIEST), డీఐఏటీ(DIAT), ఐఐపీఈ(IIPE), జేఎన్‌సీఏఎస్‌ఆర్‌ (JNCASR), ఎస్‌ఎల్‌ఐఈటీ (SLIET) సహా మొత్తం 30 సీఎఫ్‌టీఐ సంస్థల్లోని 2300కు పైగా సీట్ల భర్తీకి ఈ స్కోరునే ప్రామాణికంగా తీసుకుంటారు.


Also Read:


CMAT: కామ‌న్ మేనేజ్‌మెంట్ అడ్మిష‌న్ టెస్ట్ - 2023 నోటిఫికేషన్ విడుదల
దేశ‌వ్యాప్తంగా వివిధ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాముల్లో ప్రవేశాల‌కు నిర్వహించే కామ‌న్ మేనేజ్‌మెంట్ అడ్మిష‌న్ టెస్ట్ (సీమ్యాట్)-2023 ప్రక‌ట‌న‌ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుద‌ల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఫిబ్రవరి 13న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, మార్చి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..


గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్-2023, నోటిఫికేషన్ విడుదల, అర్హతలివే!
ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్)-2023 నోటిఫికేషన్‌ను 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)' విడుదల చేసింది. ఫార్మసీ డిగ్రీ పూర్తిచేసిన, చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు మాస్టర్ ఆఫ్ ఫార్మసీ (ఎం.ఫార్మసీ)లో ప్రవేశానికి జీప్యాట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటాయి.
నోటిఫికేషన్, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..


మేనేజ్‌మెంట్ విద్యకు సరైన మార్గం ‘మ్యాట్’, ఫిబ్రవరి 2023 నోటిఫికేషన్ విడుదల!
ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేట్‌ (ఏఐఎంఏ)-2023 ఫిబ్రవరి సెషన్‌ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (MAT) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ, ఇతర ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏఐఎంఏ మ్యాట్‌ను ఏటా నాలుగుసార్లు (ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్) నిర్వహిస్తుంది. మ్యాట్ 2022 ఫిబ్రవరి నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది.
దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..