బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) నాలుగేళ్ల సైన్స్ రిసెర్చ్ డిగ్రీ (బీఎస్సీ-రిసెర్చ్) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ పూర్తిచేసినవారు, ఈ ఏడాది ఇంటర్ సెకండియర్ పరీక్షలకు హాజరవుతున్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ విద్యాసంస్థలో నాలుగేళ్ల బీఎస్సీ రిసెర్చ్ కోర్సు పూర్తిచేసుకున్నవారు ప్రపంచస్థాయిలో పేరున్న సంస్థల్లో అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. ఐఐఎస్సీలోనే మరో ఏడాది చదువు పూర్తిచేసుకుని ఎమ్మెస్సీ డిగ్రీ పొందవచ్చు. ఆ తర్వాత పీహెచ్‌డీ దిశగా అడుగులు వేయవచ్చు.
వివరాలు...
* బీఎస్సీ(రిసెర్చ్) ప్రవేశ ప్రకటన 2023
సీట్ల సంఖ్య: 111. మహిళలకు 10 శాతం సూపర్ న్యూమరరీ కోటా సీట్లు ఉంటాయి.
అర్హత: ఎంపీసీ గ్రూపుతో 2022లో ఇంటర్ పూర్తిచేసినవాళ్లు, 2023లో ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు అర్హులు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లు తప్పనిసరిగా చదివుండాలి. ప్రథమశ్రేణి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ, ఎస్టీలు పాసైతే సరిపోతుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈబీసీలకు రూ.500; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.250.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: కేవీపీవై, జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్‌డ్, నీట్ యూజీ ర్యాంకు ఆధారంగా. ఈ ఏడాది నుంచి ఐఐఎస్‌ఈఆర్ ఆప్టిట్యూడ్ టెస్టుతోనూ అవకాశం కల్పిస్తున్నారు. ఫలితాలు వెలువడనివాళ్లు హాల్‌టికెట్ వివరాలు అందిస్తే సరిపోతుంది. జేఈఈ మెయిన్ లేదా అడ్వాన్స్‌డ్ లేదా నీట్ యూజీ లేదా ఐఐఎస్‌ఈఆర్‌లో జనరల్ అభ్యర్థులైతే 60 శాతం, ఓబీసీ నాన్-క్రిమీలేయర్, ఓబీసీ వర్గాలైతే 54 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 30 శాతం మార్కులు సాధించాలి. ఇలా కనీస మార్కులు సాధించిన అభ్యర్థుల జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయిస్తారు.
కోర్సు స్వరూపం ఇలా..
* బీఎస్సీ రిసెర్చ్ కోర్సు వ్యవధి 4 సంవత్సరాలు. మొత్తం ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి. ఇందులో మొదటి మూడు సెమిస్టర్లు అందరికీ కామన్‌గా ఉంటాయి. ఆ తర్వాత మూడు సెమిస్టర్లలో స్పెషలైజేషన్‌లో అధ్యయనం ఉంటుంది. ఇక నాలుగో సంవత్సరం పరిశోధన దిశగా ఫ్యాకల్టీ పర్యవేక్షణలో ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. కోర్సులో చేరినవాళ్లు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ, మెటీరియల్స్, ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్.. వీటిలో ఏ సబ్జెక్టునైనా స్పెషలైజేషన్‌గా తీసుకోవచ్చు. అభ్యర్థి అభిరుచితోపాటు మొదటి మూడు సెమిస్టర్లలో చూపిన ప్రతిభ ప్రాతిపదికన స్పెషలైజేషన్ కేటాయిస్తారు. నాలుగు కోర్సులను మేజర్, మైనర్ డిసిప్లిన్లుగా ఎంచుకోవాలి.
* విద్యార్థులు ఇంజినీరింగ్ నుంచి ఒక ఎలెక్టివ్ కోర్సు, హ్యుమానిటీస్‌లో ఒక సెమినార్ కోర్సు తీసుకోవడం తప్పనిసరి. కోర్సు పూర్తయిన తర్వాత డిగ్రీలను అభ్యర్థులు తీసుకున్న మేజర్ డిసిప్లిన్ పేరుతో ప్రదానం చేస్తారు. తక్కువ ధరకు వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తారు. ట్యూషన్ ఫీజు కూడా నామమాత్రమే. ఎస్సీ, ఎస్టీలు చెల్లించనవసరం లేదు. మిగిలినవారికి ఏడాదికి రూ.పదివేలు. స్కాలర్‌షిప్పులూ అందిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.03.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.05.2023.
Also Read:
వెబ్‌సైట్‌లో 'గేట్-2023' స్కోరుకార్డులు, డైరెక్ట్ లింక్ ఇదే!
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2023 ఫలితాలను ఐఐటీ కాన్పూర్ మార్చి 16న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అభ్యర్థుల స్కోరు కార్డులను మార్చి 21న విడుదల చేసింది. స్కోరుకార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి స్కోరుకార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఐఐటీ కాన్పూర్ ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 21న ఆన్సర్ కీని విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 22 నుంచి ఫిబ్రవరి 25 వరకు అభ్యంతరాలు స్వీకరించింది.
గేట్-2023 స్కోరుకార్డు కోసం క్లిక్ చేయండి..