ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) టర్మ్ ఎండ్ డిసెంబరు 2022 పరీక్ష ఫలితాలను ఫిబ్రవరి 27న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఫలితాలను చూసుకోవచ్చు. విద్యార్థులు వెబ్‌సైట్‌లోని ఫలితాల పేజీలో తమ ఎన్‌రోల్‌మెంట్ నెంబరు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు.


ఇగ్నో టర్మ్ ఎండ్ డిసెంబరు 2022 పరీక్షలను డిసెంబరు 2 నుంచి జనవరి 9 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇగ్నోలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఆలస్యరుసుముతో ఫిబ్రవరి 28తో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేనివారు ఈ తుది అవకాశాలన్ని వినియోగించుకోవాలి.


ఫలితాల కోసం క్లిక్ చేయండి..


OU Exam Result: ఓయూ సెమిస్టర్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇలా చూసుకోండి!
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 3, 4 సెమిస్టర్ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. అధికారిక వెబ్‌సైట్‌లో పలితాలను అందుబాటులో ఉంచారు. యూనివర్సిటీ పరిధిలో డిసెంబరు 29 నుంచి జనవరి 21 వరకు బీఏ, బీఎస్సీ, బీకామ్, బీబీఏ సెమిస్టర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ హాల్‌టికెట్ వివరాలు నమోదుచేసి  ఫలితాలను చూసుకోవచ్చు. 
ఫలితాల కోసం క్లిక్ చేయండి..


నీట్‌ పీజీ-2023 అడ్మిట్‌ కార్డులు వచ్చేశాయ్! ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి!
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ పీజీ)-2023 అడ్మిట్ కార్డులను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) ఫిబ్రవరి 27న విడుదల చేసింది. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నీట్‌ పీజీ-2023 పరీక్ష యథాతదంగా మార్చి 5న కంప్యూటర్ ఆధారిత విధానంలో జరగనుంది.
నీట్ పీజీ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


Also Read:


సీపెట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌-2023 నోటిఫికేషన్ వెల్లడి, పరీక్ష ఎప్పుడంటే?
సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(సీపెట్) 2023 విద్యా సంవత్సరానికి గాను వివిధ కోర్సుల ప్రవేశాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. కోర్సు అనుసరించి పదవతరగతి, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజుగా జ‌న‌ర‌ల్, ఓబీసీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250. నార్త్ ఈస్ట్రర్న్ రిజీయన్ అభ్యర్థులు రూ. 100 చెల్లిస్తే సరిపోతుంది. కంప్యూటర్ పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్- 2023 నోటిఫికేషన్ వెల్లడి, పరీక్ష ఎప్పుడంటే?
భువ‌నేశ్వర్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ & రిసెర్చ్ (నైస‌ర్), యూనివ‌ర్సిటీ ఆఫ్ ముంబ‌యి ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎన‌ర్జీ సెంట‌ర్ ఫ‌ర్ ఎక్స్‌లెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్ (సీఈబీఎస్) సంస్థల్లో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'నేష‌న‌ల్ ఎంట్ర‌న్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్) 2023' నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఫిబ్రవరి 27 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజుగా జ‌న‌ర‌ల్, ఓబీసీ అభ్యర్థులు రూ.1,200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మ‌హిళా అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.
పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..