Holiday for SchoolsDue to Murasu Cyclone | అమరావతి: ఇటీవల అర్నబ్ తుపాను విధ్వంసం సృష్టించగా తాజాగా మురసు తుపాను ఏపీ వైపు దూసుకొస్తుంది. దాంతో ఏపీలో పలు జిల్లాల్లో సోమవారం నాడు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం నుంచి నవంబర్ 3 తెల్లవారుజాము వరకు కృష్ణా, ఎన్టీఆర్ సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని  అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇళ్ల నుంచి బయటకు రావద్దని, లేకపోతే సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు.

Continues below advertisement

మురసు తుపాను తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్త చర్యగా నవంబర్‌ 2న కృష్ణా జిల్లాలోని అన్ని పాఠశాలలకు స్థానిక సెలవు ప్రకటిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) నిర్ణయం తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి.

తుపాను కారణంగా ప్రకటించిన ఈ స్థానిక సెలవును రాబోయే రోజుల్లో వచ్చే ప్రభుత్వ సెలవు దినాలలో పనిచేయడం ద్వారా భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈ ఉత్తర్వులను కృష్ణా జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు, డిప్యూటీ ఈఓలు, మండల విద్యాశాఖాధికారులు (ఎంఈఓలు) తప్పనిసరిగా అమలు చేయాలని డీఈఓ సూచనలు జారీ చేశారు.

Continues below advertisement

నేడు విద్యాసంస్థలకు సెలవు.. కలెక్టర్ ఆదేశాలు

కనకదుర్గమ్మ నెలవైన విజయవాడతో పాటు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా మురసు తుఫాను ప్రభావం చూపే అవకాశం ఉండటంతో జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తుఫాను తీవ్రత దృష్ట్యా ముందుజాగ్రత్త చర్యగా నవంబర్‌ 2న జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరు డాక్టర్‌ జి. లక్ష్మీశ ఆదేశాలు జారీ చేశారు. కేవలం పాఠశాలలకే కాకుండా జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ కాలేజీలు, అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా ఈ సెలవు వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

విద్యార్థుల భద్రత ప్రాధాన్యతగా తీసుకుని కలెక్టర్ ఈ నిర్ణయం ప్రకటించారు. జిల్లాలోని అన్ని రకాల విద్యాసంస్థల యాజమాన్యాలు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలను ఉల్లంఘించి విద్యాసంస్థలను నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా, తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గేవరకు విద్యార్థులు మరియు తల్లిదండ్రులు తగిన అప్రమత్తతతో ఉండాలని ఆయన సూచించారు.