Google AI Course: ఇది ఏఐ యుగం. కృత్రిమ మేధ రాజ్యమేలడానికి సిద్ధమవుతోంది. ఇప్పుడు ఏ రంగంలో చూసినా కృత్రిమ మేధ దూసుకుపోతోంది. కేవలం టెక్నాలజీ రంగం అనే కాకుండా ప్రతి రంగంలోనూ ఆర్డిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశిస్తోంది. ఇప్పటికే చాట్ జీపీటీ, గూగుల్ బార్డ్ లాంటి ఏఐ టూల్స్ చేస్తున్న పనులు చూస్తూ నోరెళ్లబెడుతున్నాం. ఏఐ టూల్స్ వాడుకుంటూ వివిధ దేశాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు, సినీ, క్రీడా ప్రముఖులు వంట వండుతున్నట్లు, సెల్ఫీలు తీసుకుంటున్నట్లు క్రియేట్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాల్లో చూస్తూనే ఉన్నాం. ఈ రోజుల్లో ఏఐపై పెరుగుతున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని గూగుల్ సంస్థ ప్రత్యేకమైన కోర్సులను రూపొందించింది.
గూగుల్ తొమ్మిడి ఉచిత ఏఐ కోర్సులను ప్రకటించింది. క్లౌడ్ స్కిల్ బూస్ట్ ప్లాట్‌ఫారమ్ పై ఈ కోర్సులు అందించనుంది. ఇందులో జెనరేటివ్ -ఏఐ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఇమేజ్ జెనరేషన్ కోర్సులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ఇప్పుడు ఈ కోర్సులను ఉచితంగా యాక్సెస్ చేసుకునే వీలుంది. వీటిలో ఎక్కువ భాగం కేవలం వన్ డే కోర్సులే ఉన్నాయి. ఈ కోర్సులను పూర్తి చేసిన వారికి గూగుల్ సంస్థ వర్చువల్ బ్యాడ్జ్ లను కూడా ఇస్తుంది. చాలా సింపుల్ ఫార్మట్ లో ఈ కోర్సులు ఉంటాయి. వీడియో లెసన్ తర్వాత కొన్ని చాయిస్ బేస్డ్ ప్రశ్నలు ఉంటాయి. కొన్ని కోర్సుల్లో కొన్ని అదనపు డాక్యుమెంటేషన్ కూడా ఉంటాయి. ఏదైనా కోర్సులో ల్యాబ్ ఉంటే.. దానికి సబ్‌స్క్రైబ్ చేసుకోవడం ద్వారా దానిని అన్‌లాక్ చేయవచ్చు. లేదంటే వివిధ కంపైనింగ్ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా వాటిని అన్‌లాక్ చేయవచ్చు.
గూగుల్ అందించే ఉచిత ఏఐ కోర్సులు:
1. ఇంట్రడక్షన్ టు జనరేటివ్ ఏఐ
2. ఇంట్రడక్షన్ టు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్
3. ఇంట్రడక్షన్ టు రెస్పాన్సిబుల్ ఏఐ
4. ఇంట్రడక్షన్ టు ఇమేజ్ జనరేషన్
5. ఎన్‌కోడర్ -డీకోడర్ ఆర్కిటెక్చర్
6. అటెన్షన్ మెకానిజం
7. ట్రాన్స్‌ఫార్మర్ మోడల్స్ అండ్ BERT మోడల్
8. క్రియేట్ ఇమేజ్ క్యాప్షనింగ్ మోడల్స్
9. ఇంట్రడక్షన్ టు జనరేటివ్ ఏఐ స్టూడియో
10. జనరేటివ్ ఏఐ ఎక్స్‌ప్లోరర్ - వెర్టెక్స్ ఏఐ (క్వెస్ట్)
గూగుల్ అసిస్టెంట్, సిరి తరహాలో చాట్‌జీపీటీ
లాంచ్ అయిన రోజు నుంచి ఛాట్ జీపీటీ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఛాట్ జీపీటీ మరో అడుగు వేయడానికి సిద్ధం అయింది. Infinix తన నోట్ 30 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లో Chat GPTకి సపోర్ట్ ఇవ్వనుందని తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజం అయితే అది కచ్చితంగా సంచలన వార్త అవుతుంది. ఇప్పటి వరకు ఏ మొబైల్ కంపెనీ కూడా ఈ పని చేయలేదు. కంపెనీ తన ఫోలాక్స్ వాయిస్ అసిస్టెంట్‌లో చాట్ జీపీటీని అందించనుందని తెలుస్తోంది. Google దాని స్వంత గూగుల్ అసిస్టెంట్ ఫీచర్‌ను కలిగి ఉన్నట్లే, Infinix కూడా వాయిస్ అసిస్టెంట్‌ను అందించే దాని స్వంత ఫోలాక్స్ యాప్‌ను క్రియేట్ చేసింది.
ఇన్‌ఫీనిక్స్ లాంచ్ చేయనున్న ఫోన్‌లో Chat GPT నిజంగా కనిపిస్తే, అది Google, Siri, Bixby లకు ఆందోళన కలిగించే విషయం. అయితే కంపెనీకి ఒక సవాలు ఏమిటంటే ఫోన్‌కి Chat GPTని తీసుకువస్తే, ఇంటర్నెట్ నుంచి రియల్ టైమ్ సమాచారాన్ని అందించే విధంగా Bing లాగా దాన్ని సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చాట్ జీపీటీ నాలెడ్జ్ డేటాబేస్ ఆధారంగా రూపొందించబడింది మరియు ఇది 2021 వరకు ఉన్న డేటాను మాత్రమే వినియోగదారులకు తెలియజేయగలదు.