తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లాలోని గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్ 2023-24 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు కల్పించనున్నారు. కోర్సులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జూన్ 9లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 

1)  పీజీ ప్రోగ్రామ్స్

ఎంఏ: తమిళ్‌ అండ్‌ ఇండియన్‌ లిటరేచర్‌, హిందీ, ఇంగ్లిష్ అండ్‌ కమ్యూనికేటివ్ స్టడీస్, రూరల్ డెవలప్‌మెంట్ స్టడీస్, గాంధీయన్ స్టడీస్ అండ్ పీస్ సైన్స్, ఎకనామిక్స్.

ఎంకాం: కో-ఆపరేటివ్‌ మేనేజ్‌మెంట్‌

ఎంఎస్సీ: మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, హోమ్ సైన్స్ ఎక్స్‌టెన్షన్ అండ్ కమ్యూనికేషన్, టెక్స్‌టైల్స్ అండ్ ఫ్యాషన్ డిజైన్, బోటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, అప్లైడ్ జియాలజీ అండ్‌ జియోమాటిక్స్, జియోఇన్ఫర్మేటిక్స్.

కోర్సు వ్యవధి: నాలుగు సెమిస్టర్లు

2) అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్

➥ ఎంఏ డెవలప్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్

➥ ఎంఏ సోషియాలజీ.

కోర్సు వ్యవధి: పది సెమిస్టర్లు.

3) పీజీ డిప్లొమా ప్రోగ్రామ్స్

➥ స్పేషియల్ టెక్నాలజీస్

➥ అప్లైడ్ జెరోంటాలజీ

➥ శానిటరీ ఇన్‌స్పెక్టర్ కోర్సు

➥ ఎపిగ్రఫీ

➥ యోగా

➥ సస్టైనబుల్ సోషల్ డెవలప్‌మెంట్.

కోర్సు వ్యవధి: రెండు సెమిస్టర్లు.

4) అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్

➥ బీకాం

➥ బీబీఏ

➥ బీఏ

➥ బీఎస్సీ

కోర్సు వ్వవధి: ఆరు సెమిస్టర్లు.

5) ప్రొఫెషనల్ కోర్సులు:

➥  బీఎస్సీ

➥  బీటెక్‌

➥  ఎంటెక్‌ ఎం

➥ సీఏ

➥ ఎంబీఏ

➥  బీఎస్సీ బీఈడీ

➥  బీఈడీ

➥  ఎంఈడీ. 

6)  స్కిల్‌ బేస్డ్‌ ప్రోగ్రామ్స్

➥  బీ.ఒకేషనల్‌/ డిప్లొమా/ సర్టిఫికేట్.

7)  డిప్లొమా ప్రోగ్రామ్స్

➥  టెక్స్‌టైల్ టెక్నాలజీ

➥  అగ్రికల్చర్

➥  యోగా

8) సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌

అర్హత:  కోర్సును అనుసరించి పదోతరగతి ఉత్తీర్ణత, హయ్యర్ సెకండరీ ఎగ్జామ్‌, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.600. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ:  09.06.2023.

Notification

Online Application

Website

Also Read:

తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ ప్రవేశాలు, దరఖాస్తు ప్రారంభం!తెలంగాణ‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం(ఆంగ్ల మాధ్యమం)లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌ వెలువడింది. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మే 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి పాఠశాలలో బాలికలకు భోజన, వసతి సౌకర్యం కల్పిస్తారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్, సీఏ, టీపీటీ, సీఎస్ తదితర పోటీపరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఒక్కో దాంట్లో 40 సీట్లు ఉంటాయి.ప్రవేశాల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

ఏపీ మైనార్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మూడు ఏపీ మైనార్టీ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరంలో సీట్ల భర్తీకి సంబంధించిన ఏపీఆర్‌జేసీ(మైనార్టీ) సెట్‌-2023 నోటిఫికేషన్ వెలువడింది. గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. అర్హులైన మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన విద్యార్థులు జూన్‌ 28 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..