పుణెలోని ఫిల్మ్ & టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌టీఐఐ), కోల్‌కతాలోని సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ సంయుక్తంగా- జాయింట్ఎంట్రన్స్ టెస్ట్(జెట్) 2022-2023 నోటిఫికేషన్ విడుదల చేశాయి. దీనిద్వారా అర్హులైన అభ్యర్థులు ఫిల్మ్, టెలివిజన్  విభాగాల్లో పీజీ డిప్లొమా, యూజీ సర్టిఫికెట్, పీజీ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ప్రవేశ పరీక్షను ఎ,బి,సి గ్రూప్‌ల వారీగా నిర్వహిస్తారు. అభ్యర్థులు ఒక్కో గ్రూప్  నుంచి ఒక కోర్సు చొప్పున గరిష్ఠంగా మూడు కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం 20 కోర్సుల్లో కొన్ని ఎఫ్‌టీఐఐ, కొన్ని ఎస్ఆర్ఎఫ్‌టీఐ, మరికొన్నింటిని సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.


వివరాలు..


➥ గ్రూప్-ఎ:


🔰 పీజీ డిప్లొమా కోర్సులు: ఆర్ట్ డైరెక్షన్ అండ్ ప్రొడక్షన్ డిజైన్, స్క్రీన్ యాక్టింగ్, స్క్రీన్ రైటింగ్ (ఫిల్మ్, టీవీ అండ్ వెబ్ సిరీస్), యానిమేషన్ సినిమా, ప్రొడక్షన్ ఫర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్, ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ మీడియా మేనేజ్‌మెంట్.


🔰 యూజీ సర్టిఫికేట్ కోర్సులు: యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ డిజైన్.

వ్యవధి: స్క్రీన్ యాక్టింగ్, స్క్రీన్ రైటింగ్, ఈ అండ్ డీఎంఎం కోర్సులకు రెండేళ్లు; మిగిలిన కోర్సులకు మూడేళ్లు ఉంటుంది.


➥ గ్రూప్-బి: 


🔰 పీజీ డిప్లొమా కోర్సులు: డైరెక్షన్ అండ్ స్క్రీన్‌ప్లే రైటింగ్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్ అండ్ సౌండ్ డిజైన్.

వ్యవధి: మూడేళ్లు.


➥ గ్రూప్-సి:


🔰 పీజీ సర్టిఫికేట్ కోర్సులు: డైరెక్షన్, ఎలక్ట్రానిక్ సినిమాటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్ అండ్ టెలివిజన్ ఇంజినీరింగ్.


🔰 పీజీ డిప్లొమా కోర్సులు: డైరెక్షన్ అండ్ ప్రొడక్షన్ ఫర్ ఈడీఎం, సినిమాటోగ్రఫీ ఫర్ ఈడీఎం, ఎడిటింగ్ ఫర్ ఈడీఎం, సౌండ్ ఫర్ ఈడీఎం, రైటింట్ ఫర్ ఈడీఎం.


వ్యవధి: పీజీ సర్టిఫికేట్ ఏడాది, పీజీ డిప్లొమా రెండేళ్లు ఉంటుంది.


అర్హత: కోర్సు, విభాగం అనుసరించి పన్నెండో తరగతి, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి.


రిజిస్ట్రేషన్ ఫీజు: ఒక కోర్సుకు రూ.2000, రెండు కోర్సులకు రూ.3000, మూడు కోర్సులకు రూ.4000.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.


ప్రవేశ ప్రక్రియ: రాత పరీక్ష, ఓరియంటేషన్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పీజీ డిప్లొమా స్క్రీన్ యాక్టింగ్‌కు


ఆడిషన్‌ను ప్రత్యేకంగా నిర్వహిస్తారు.


తెలుగు రాష్ట్రాల్లో రాత పరీక్ష కేంద్రం: హైదరాబాద్.


ముఖ్యమైన తేదీలు: 


ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 04-03-2023.


అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: 10-03-2023.


జెట్ పరీక్ష నిర్వహణ తేదీలు: 18/ 19-03-2023.


➥ ఫలితాల వెల్లడి: జూన్ మొదటి వారం, 2023.


Notification


Website


Also Read:


UGC NET: యూజీసీ నెట్‌-2022 సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ వచ్చేశాయ్! పరీక్షల షెడ్యూలు ఇలా!
యూజీసీ నెట్‌-2022 సిటీ ఇంటిమేషన్ స్లిప్స్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల సిటీ ఇంటిమేషన్ స్లిప్స్‌ను అందుబాటులో ఉంచింది. యూజీసీ నెట్-2022 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారు పరీక్ష సెంటర్ వివరాలకు సంబంధించిన స్లిప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. త్వరలోనే పరీక్ష అడ్మిట్ కార్డులను కూడా ఎన్టీఏ త్వరలోనే విడుదల చేయనుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


Inter Marks: 'ఇంటర్' విద్యార్థులకు అలర్ట్, 'ఎంసెట్' రాయాలంటే ఇన్ని మార్కులు ఉండాల్సిందే!
తెలంగాణలో ఎంసెట్‌ పరీక్షకు హాజరయ్యేందుకు ఇంటర్‌లో 45 శాతం మార్కులు తప్పక ఉండాలన్న నిబంధనను ఈ ఏడాది పునరుద్ధరించనున్నారు. నిర్దిష్ట మార్కులు సాధించిన వారే ఎంసెట్‌ రాసే అవకాశం కల్పించాలని అధికారులు ఈ మేరకు నిర్ణయించారు. అయితే జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు ఇంటర్‌ గణితం, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో 45 శాతం మార్కులు, అలాగే.. రిజర్వేషన్‌ కేటగిరీ విద్యార్థులు 40 శాతం మార్కులు ఉంటేనే ఎంసెట్‌‌కు అర్హులు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..