Education Loan Interest Rates: మారుతున్న ప్రపంచంలో, నేడు ప్రతి ఒక్క వస్తువు ధర పెరుగుతోంది. విద్య- ఆరోగ్యం వంటి ప్రాథమిక, అవసరమైన వాటి కోసం కూడా ప్రజలు లక్షలు ఖర్చు చేయవలసి వస్తుంది. పెద్ద నగరాలతోపాటు చిన్న పట్టణాల్లో కూడా విద్య ఖరీదైనదిగా మారుతోంది. పిల్లల పాఠశాల ఫీజులు కూడా లక్షల్లోకి చేరుకుంటున్నాయి. ఉన్నత విద్య గురించి చెప్పనవసరం లేదు. ఇంజనీరింగ్, ఇతర గ్రాడ్యుయేషన్ కోర్సులు కూడా చాలా ఖరీదైనవిగా మారాయి. ప్రైవేట్ కళాశాలల ఫీజులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

Continues below advertisement

అలాంటి పరిస్థితుల్లో చాలా మంది తమ పిల్లల చదువు కోసం బ్యాంకుల విద్య రుణాలపై ఆధారపడుతున్నారు. మీరు కూడా మీ కోసం లేదా మీ బంధువుల కోసం విద్య రుణం తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే, దేశంలోని ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకుల విద్య రుణాల వడ్డీ రేట్ల గురించి మీరు తెలుసుకోవాలి. తద్వారా మీరు సరైన బ్యాంకును ఎంచుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండవచ్చు. అలాగే, మీరు ఆర్థిక నష్టాన్ని కూడా నివారించవచ్చు.

Also Read: బంగారు రుణంపై ఏ బ్యాంకు తక్కువ వడ్డీ ఆఫర్‌ చేస్తోంది?

వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) విద్యార్థులకు 7.15 శాతం నుంచి 10.15 శాతం వరకు వడ్డీ రేటుతో రుణాలు అందిస్తుంది. అదే సమయంలో, ప్రైవేట్ రంగ బ్యాంకులలో అతిపెద్ద బ్యాంకు అయిన HDFC బ్యాంక్ 9 శాతం నుంచి 10.25 శాతం వరకు వడ్డీ రేటుతో విద్య రుణాలను అందిస్తుంది. అయితే, మీరు ఏ కోర్సు చేస్తున్నారు. మీ రుణ మొత్తం ఎంత అనే దానిపై రెండు బ్యాంకుల వడ్డీ రేట్లు ఆధారపడి ఉంటాయి. దీనితో పాటు, బ్యాంకులు ఇంకా చాలా విషయాలను పరిశీలిస్తాయి. మంచి, ప్రసిద్ధ కళాశాలలో ప్రవేశం పొందిన తర్వాత విద్య రుణం త్వరగా లభిస్తుంది.

Continues below advertisement

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కూడా విద్యార్థులకు విద్య రుణ సౌకర్యాన్ని అందిస్తుంది. దీని వడ్డీ రేటు దాదాపు 8.55 శాతం నుంచి ప్రారంభమవుతుంది. అదేవిధంగా, బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) తన కస్టమర్లకు 7.10 శాతం నుంచి 9.95 శాతం వరకు వడ్డీ రేటుతో రుణాలు అందిస్తుంది. కెనరా బ్యాంక్ విద్య రుణాల వడ్డీ రేట్లు 7.10 శాతం నుంచి 10.35 శాతం వరకు ఉంటాయి.

Also Read: భారత్‌లో ప్రయాణీకులు ఎడమ వైపు నుంచి బస్సులు ఎక్కడానికి కారణమేంటీ?