ఏపీలోని పాఠశాలలకు అక్టోబరు 14 నుంచి దసరా సెలవులు ప్రారంభంకానున్నాయి. అక్టోబరు 24 వరకు సెలవులు కొనసాగనున్నాయి. ఈ సారి 11 రోజులపాటు అక్కడి స్కూళ్లకు దసరా సెలవులు రానున్నాయి. దసరా సెలవుల అనంతరం 25 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలోని పాఠశాలలకు అక్టోబరు 14 నుంచి 24 వరకూ దసరా సెలవులను ఖరారు చేస్తూ అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


ఏపీలో సమ్మెటివ్‌ అసెస్‌మెంట్-1 పరీక్షలు వాయిదా..
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పాఠశాలల్లో సమ్మెటివ్‌ అసెస్‌మెంట్(ఎస్‌ఏ)-1 పరీక్షలు వాయిదా పడ్డాయి. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. నవంబరు 4 నుంచి ఎస్‌ఏ-1 పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా.. వాటిని నవంబరు 15కు వాయిదా వేశారు. నవంబరు 3 నుంచి 3, 6, 9వ తరగతులకు రాష్ట్ర స్థాయి సాధన సర్వే నిర్వహిస్తున్నందున పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. సర్వే ప్రాక్టీస్‌ కోసం ప్రశ్నపత్రాలను సైతం విద్యాశాఖ పాఠశాలలకు పంపించింది.


జూనియర్ కాలేజీలకు వారం రోజులే..
ఏపీలోని పాఠశాలలకు 11 రోజుల దసరా సెలవులు రాగా.. ఇంటర్ కాలేజీలకు మాత్రం కేవలం వారం రోజులే సెలువులు ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంటర్ కాలేజీలకు అక్టోబరు 19 నుంచి 25 వరకు వరకు జూనియర్ కళాశాలలకు సెలవులు ఇస్తున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయని తెలిపింది. తిరిగి అక్టోబరు 26న కళాశాలలు పునఃప్రారంభమవుతాయని చెప్పింది. సెలవురోజుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని బోర్డు హెచ్చరించింది. 


ALSO READ:


అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు మరోసారి పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును అధికారులు మరోసారి పొడిగించారు. అక్టోబరు 4తో గడువు ముగియగా.. ప్రవేశాలు పొందేందుకు అక్టోబరు 20 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అభ్యర్థులు అక్టోబరు 20 వరకు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. 
ప్రవేశాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


'ఆయుష్‌' పీజీ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్, 17 వరకు దరఖాస్తుకు అవకాశం
తెలంగాణలో ఆయుష్‌ పీజీ వైద్య సీట్ల భర్తీకి కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం అక్టోబరు 10న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏఐఏపీజీఈటీ-2023 పరీక్షలో అర్హత సాధించిన వారు దరఖాస్తుకు అర్హులు. పీజీ ఆయుర్వేదం, హోమియో, యునానీ కోర్సుల్లో కన్వీనర్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్‌లో అక్టోబరు 11న ఉదయం 9 గంటల నుంచి అక్టోబరు 17న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 
నోటిఫికేషన్, ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..


బీపీటీ, బీఎస్సీ పారామెడికల్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల
ఏపీలో 2023-24 విద్యాసంవత్సరానికి బీపీటీ, బీఎస్సీ పారా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి డా.వైఎస్సార్‌ హెల్త్ యూనివర్సిటీ అక్టోబరు 8న నోటిఫికేషన్ విడుదల చేసింది. బీపీటీతో పాటు వివిధ బీఎస్సీ పారామెడికల్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కాంపిటెంట్‌ అథారిటీ కోటా సీట్ల భర్తీకి అక్టోబర్‌ 8 నుంచి 19 వరకు అర్హులైన ఇంటర్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...