విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీలో కాంపీటేటివ్ అథారిటీ కోటా కింద యూజీ ఆయుష్ (బీఏఎంస్, బీహెచ్‌ఎంస్, బీయూఎంస్) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇంటర్ అర్హతతోపాటు నీట్ యూజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 17 నుంచి 21 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నీట్ యూజీ కటాఫ్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
వివరాలు..
* ఆయుష్ యూజీ ప్రవేశాలు 2023-24
➥ బీఏఎంస్ (ఆయుర్వేదం)
➥ బీహెచ్‌ఎంస్ (హోమియో)
➥ బీయూఎంస్ (యునానీ)
అర్హతలు: ఇంటర్(బైపీసీ) ఉత్తీర్ణత ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులలో కనీసం 50 శాతం మార్కులు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
కటాఫ్ మార్కులు: జనరల్/ఈడబ్ల్యూఎస్-50 పర్సంటైల్ (137 మార్కులు), జనరల్/ఈడబ్ల్యూఎస్ దివ్యాంగులు-45 పర్సంటైల్ (121 మార్కులు), ఎస్సీ/ఎస్టీ/బీసీ-40 పర్సంటైల్ (107 మార్కులు), ఎస్టీ దివ్యాంగులకు-40 పర్సంటైల్ (108 మార్కులు)గా నిర్ణయించారు.
వయోపరిమితి: 31.12.2023 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.2950. ఎస్సీ, ఎస్టీలకు రూ.2360 చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: నీట్ యూజీ కటాఫ్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 17.10.2023
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 21.10.2023
ALSO READ:
ఐఐటీ జామ్-2024 దరఖాస్తు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో మాస్టర్స్ డిగ్రీ చేయాలనుకునే వారికోసం ఉద్దేశించిన ‘జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్)-2024’ దరఖాస్తు గడువును అక్టోబరు 20 వరకు పొడిగించారు. సెప్టెంబరు 5న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 13తో ముగియాల్సిన గడువును పొడిగించారు. సంబంధిత సబ్జెక్ట్‌లతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఏడాది ఐఐటీ మద్రాస్ ఈ ఏడాది 'జామ్' పరీక్ష నిర్వహించనుంది.
దరఖాస్తు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలో ఎంపీహెచ్‌డబ్ల్యూ (ఫీమేల్)/ ఏఎన్‌ఎం ట్రైనింగ్ కోర్సులో ప్రవేశాలు
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం, 2023-24 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలోని 27 ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎంపీహెచ్‌డబ్ల్యూ (ఫీమేల్)/ ఏఎన్‌ఎం ట్రైనింగ్ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబరు 20లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీలో పీజీడీఎం ప్రోగ్రామ్, ఈ అర్హతలుండాలి
పుణెలోని నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ, 2024 విద్యా సంవత్సరానికి పీజీడీఎం ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు క్యాట్, ఎక్స్‌ఏటీ, సీమ్యాట్ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్హతలు, పని అనుభవం, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..