Dr.YSRHU Diploma Courses: పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చరల్ యూనివర్సిటీ 2024-25 విద్యాసంవత్సరానికి సంవత్సరానికి సంబంధించి డిప్లొమా ఇన్ హార్టికల్చర్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా డా.వైఎస్సార్‌ హార్టికల్చరల్ వర్సిటీతోపాటు, దాని అనుబంధ హార్టికల్చర్ కళాశాలల్లో మొత్తం 500 సీట్లలో ప్రవేశాలు కల్పించనున్నారు. ఇందులో ప్రభుత్వ కళాశాలల్లో 220 సీట్లు, అనుబంధ కళాశాలల్లో 280 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పదోతరగతి ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.400 చెల్లిస్తే సరిపోతుంది. పదోతరగతి మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.


వివరాలు..


* డిప్లొమా కోర్సులు


మొత్తం సీట్లు: 500.


సీట్ల కేటాయింపు:  ఓపెన్ కేటగిరీ (OC): 50 %, బీసీ-ఎ: 7 %, బీసీ-బి: 10 %, బీసీ-సి: 1 %, బీసీ-డి: 7 %, బీసీ-ఈ: 4 %, ఎస్సీ: 15 %, ఎస్టీ: 6 %. ఇందులో దివ్యాంగులకు 5 %, ఆర్మీ కుటుంబాలకు చెందినవారికి 2 %, NCC అభ్యర్థులకు 1 %, స్పోర్ట్స్ కేటగిరీ అభ్యర్థులకు 0.5 % సీట్లు కేటాయిస్తారు. ఇక మొత్తం సీట్లలో 33.33 శాతం సీట్లు బాలికలకు కేటాయిస్తారు. ఇక మొత్తం సీట్లలో 85 % లోకల్ అభ్యర్థులతో, 15% సీట్లను మెరిట్ ఆధారంగా అన్-రిజర్వ్‌డ్ అభ్యర్థులకు కేటాయిస్తారు.


➥ డిప్లొమా ఇన్‌ హార్టికల్చర్‌


సీట్ల సంఖ్య: 480 సీట్లు (ప్రభుత్వ కళాశాలల్లో- 200 సీట్లు; అనుబంధ కళాశాలల్లో- 280 సీట్లు)


కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు (4 సెమిస్టర్లు).


➥ డిప్లొమా ఇన్‌ హార్టికల్చరల్ ఫుడ్ ప్రాసెసింగ్‌


సీట్ల సంఖ్య: 20 (ప్రభుత్వ కళాశాలలో- 20 సీట్లు)


కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు (4 సెమిస్టర్లు).


బోధనా మాధ్యమం: ఇంగ్లిష్.


అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సీబీఎస్ఈ (CBSE), ఐసీఎస్‌ఈ (ICSE), ఎన్‌ఐఓఎస్ (NIOS), ఓఎస్‌ఎస్ (OSS) సిలబస్‌తో పదోతరగతి పూర్తిచేసి ఉండొచ్చు.


వయోపరిమితి: 31.08.2024 నాటికి 15 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 31.08.2002 - 31.08.2009 మధ్య జన్మించి ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: పదోతరగతి మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా.


దరఖాస్తు ఫీజు: రూ.800. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.400 చెల్లిస్తే సరిపోతుంది. 


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం: 25.05.2024.


➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: 18.06.2024.


➥ ఫేజ్-1, ఫేజ్-2, మాపప్ మాన్యువల్ కౌన్సెలింగ్ తేదీలు: తర్వాత ప్రకటిస్తారు


Notification


Online Application


Website


ALSO READ:


ఏపీ హార్టిసెట్‌ నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హార్టికల్చరల్‌ యూనివర్సిటీ, 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ(ఆనర్స్) కోర్సులో ప్రవేశానికి 'ఏపీ హార్టిసెట్‌-2024' నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. హార్టిసెట్‌ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 101 సీట్లను భర్తీ చేస్తారు. వీటిలో యూనివర్సిటీ కాలేజీ సీట్లు 61 కాగా.. ప్రైవేట్ కాలేజీ సీట్లు 40 ఉన్నాయి. మొత్తం సీట్లులో లోకల్ అభ్యర్థులకు 85 శాతం సీట్లు, 15 శాతం సీట్లు అన్-రిజర్వ్‌డ్ కింద భర్తీ చేస్తారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 22న ప్రారంభంకాగా.. జూన్ 15న సాయంత్రం 4 గంటల్లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..