తెలంగాణలో ఈ ఏడాది డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో లక్ష వరకు సీట్లను ఫ్రీజ్‌ అధికారులు చేశారు. దీంతో మొత్తం సీట్లల్లో దాదాపు లక్ష వరకు సీట్లకు కోతపడింది. డిగ్రీ కళాశాలల్లో 15 ప్రవేశాల లోపు ఉండే కోర్సులు, సెక్షన్లను నిలిపివేశారు. అయితే వచ్చే ఏడాది ప్రవేశ సమయంలో ఫ్రీజ్ చేసిన ఈ లక్ష సీట్లను కోర్సుల మార్పిడి ద్వారా నడిపించుకునేందుకు ఆయా కళాశాల యాజమాన్యాలకు అధికారులు అవకాశం కల్పించనున్నారు. ఈ ప్రభావం రాష్ట్రంలోని 900 డిగ్రీ కళాశాలలపై పడనుంది. 


రాష్ట్రంలో దాదాపు వెయ్యికి పైగా కాలేజీలు ఉంటే అందులో 978 ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీల్లో డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) ద్వారా డిగ్రీ సీట్లను భర్తీ చేస్తారు. ఇందులో మొత్తంగా 4.60 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు జరిపిన మూడు విడతల్లో నిండిన సీట్లు కేవలం 1.53 లక్షలే. స్పెషల్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌ ప్రస్తుతం కొనసాగుతోంది.


తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ఏటా 2.50 లక్షల లోపే సీట్ల భర్తీ అవుతూ వస్తోంది. దాదాపు 2 లక్షలకు పైగా సీట్లు మిగిలిపోతున్నాయి. కొన్ని కోర్సుల్లో అసలు ప్రవేశాలే ఉండటం లేదు. మరికొన్ని కోర్సుల్లో పరిమితికి మించి చేరుతున్నారు. దీంతో విద్యార్థులు చేరని కోర్సులను, సెక్షన్లను రద్దు చేసిటన్లు ఉన్నత విద్యామండలి అధికారులు చెప్పారు.


దోస్త్ కౌన్సెలింగ్‌లో భాగంగా సెప్టెంబర్‌ 16న మూడో విడత సీట్లను కేటాయించారు. అయినా ఇంకా 3 లక్షల వరకు సీట్లు మిగలడంతో స్పెషల్‌ ఫేజ్‌ను నిర్వహిస్తున్నారు. అక్టోబరు 1 నుంచి 7 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అక్టోబరు 9న స్పెషల్‌ ఫేజ్‌ సీట్లను కేటాయించనున్నారు. అయినా గానీ భారీ స్థాయిలో సీట్లు నిండే పరిస్థితి లేదు. అలాగే ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ ఇంకా పూర్తికాలేదు. ఎంసెట్‌లో సీటు రాని విద్యార్థులు డిగ్రీ వైపు చూస్తారు. దీంతో మరో 70 వేల డిగ్రీ సీట్లు భర్తీ అయ్యే అవకాశం ఉంది. ఇలా మొత్తంగా చూసుకున్నాగానీ 2.20 లక్షల కంటే ఎక్కువ సీట్లు భర్తీ అయ్యే అవకాశం లేదు. 



Also Read:


RAOU Admissions: అంబేడ్కర్ వర్సిటీ ప్రవేశ గడువు మళ్లీ పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును అధికారులు మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబరు 15 వరకు ప్రవేశాల దరఖాస్తుకు అవకాశం కల్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికే మూడుసార్లు దరఖాస్తు గడువును పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే అభ్యర్థులు అభ్యర్థన మేరకు ప్రవేశ దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు.
కోర్సులు, ప్రవేశ వివరాల కోసం క్లిక్ చేయండి..


Pragathi Scholarship: మహిళా 'ప్రతిభ'కు చేయూత 'ప్రగతి' స్కాలర్‌షిప్‌!! దరఖాస్తు చేసుకోండి, అర్హతలివే!
మహిళలను సాంకేతిక విద్యలో ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘ప్రగతి స్కాలర్‌షిప్‌’  నోటిఫికేషన్‌ వెలువడింది.  ‘ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ)’ ఏటా ఈ ఉపకారవేతనం అందిస్తోంది. డిప్లొమా, డిగ్రీ కోర్సులు చదువుతున్న అర్హులైన అమ్మాయిలకు ఈ స్కీమ్ కింద ఆర్థికసాయం అందిస్తారు. కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలకు మించకూడదు.  ఒక కుటుంబం నుంచి ఇద్దరు అమ్మాయిలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. సరైన అర్హతలున్న మహిళలు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాలి. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా స్కాలర్‌షిప్ అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
స్కాలర్‌షిప్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..